పబ్లిక్‌గా ఐటమ్ భామతో స్టార్ హీరో.. రూమర్స్‌కు మరింత బలం.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్, డేటింగ్ వంటి వ్యవహారాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ కొన్ని ప్రేమ వ్యవహారాలు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. చాలా రోజులుగా బాలీవుడ్ ఓ రూమర్ వినిపిస్తోంది. యంగ్ హీరో అర్జున్ కపూర్,సాంగ్స్ తో ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా మధ్య రహస్యంగా ఎఫైర్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ గురించి అర్జున్ కపూర్ కానీ, మలైకా అరోరా కానీ ఎప్పుడూ స్పందించలేదు.

భర్తనుంచి విడిపోయి
మలైకా అరోరా చాలా రోజుల క్రితమే మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మలైకా అరోరా ఒంటరిగానే ఉంటోంది. దబాంగ్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో మలైకా ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

కుర్ర హీరోతో డేటింగ్
అర్జున్ కపూర్ కారులో వెళుతూ మలైకా అరోరాతో కనిపించాడు. అప్పటి నుంచి వీరి మధ్య ఎఫైర్ సాగుతోందనే రూమర్స్ మొదలయ్యాయి. అర్జున్ కపూర్ వయసు 33 ఏళ్ళు కాగా, మలైకా అరోరా 45 ఏళ్ల ముదురు సుందరి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

పబ్లిక్‌గా తిరిగేస్తున్నారు
తాజాగా ఈ జంట పబ్లిక్ గానే తిరిగేస్తున్నారు. ఇటీవల లక్మే ఫ్యాషన్ వీక్ లో అర్జున్ కపూర్, మలైకా కనిపించారు. తాజాగా ఇండియా గాట్ టాలెంట్ అనే టీవీషోలో గెస్ట్ లుగా అర్జున్ కపూర్, మలైకా అరోరా కలసి పాల్గొనడం విశేషం. చేతిలో చేయి వేసి మలైకాని అర్జున్ కపూర్ స్టేజిపైకి తీసుకువెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రూమర్స్‌కు మరింత బలం
అర్జున్ కపూర్, మలైకా అరోరా పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వీరి మధ్య ఎఫైర్ నిజమే అని బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. వీరిద్దరూ తమ ప్రేమ గురించి త్వరలో ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











