twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా శత్రువులకు కూడా అలాంటి పరిస్థితి వద్దు.. శ్రీదేవి మరణం గురించి అర్జున్ కపూర్!

    |

    ఈ ఏడాది ఆరంభంలో లెజెండరీ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అనుకోని పరిస్థితుల నడుమ మృత్యువాత పడింది. ఎవరూ ఊహించని శ్రీదేవి మరణవార్త దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఆ వార్త వినగానే తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అర్జున్ కపూర్ వివరించాడు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం తన కుటుంబం మధ్య నెలకొన్న అనుబంధాల గురించి అర్జున్ కపూర్ వివరించాడు.

    అర్జున్ కపూర్, పరిణితి చోప్రా పెళ్లి చేసుకొంటారా?అర్జున్ కపూర్, పరిణితి చోప్రా పెళ్లి చేసుకొంటారా?

    చెల్లెళ్లకు దగ్గరగా

    చెల్లెళ్లకు దగ్గరగా

    శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ తన చెల్లెళ్లకు బాగా చేరువయ్యాడు. అప్పటివరకు అర్జున్ కపూర్ కి శ్రీదేవి కుటుంబానికి కొంత గ్యాప్ ఉండేది. శ్రీదేవి మరణించిన సమయంలో తన అన్ని కార్యక్రమాలని అర్జున్ కపూర్ దగ్గరుండి జరిపించాడు.

    అందరితో మాట్లాడుతున్నా

    అందరితో మాట్లాడుతున్నా

    ప్రస్తుతం తాను తన చెల్లెళ్ళని కలసి మాట్లాడుతున్నా అని అర్జున్ కపూర్ తెలిపాడు. జాన్వీ కపూర్, ఖుషి కోసమే నేను, అన్షులా ఉన్నాం. ప్రస్తుతం మా అందరికి వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి. కానీ ఎవరికీ ఏ అవసరం వచ్చినా అందరం కలసి చర్చించుకుంటున్నాం అని అర్జున్ కపూర్ తెలిపాడు.

    నా శత్రువుకి కూడా

    నా శత్రువుకి కూడా

    నేను పంజాబ్ లో ఉన్నా సమయంలో శ్రీదేవి మరణ వార్త తెలిసింది. ఆ సమయంలో నేను అనుభవించిన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకున్నా. ఆ వార్త తీసుకోవడానికి చాలా కఠినంగా అనిపించింది. ఆ సమయంలో కుటుంబంతో ఉండడం చాలా అవసరం అని వెంటనే బయలుదేరినట్లు అర్జున్ కపూర్ తెలిపాడు.

    నాన్న సంతోషంగా ఉన్నారు

    నాన్న సంతోషంగా ఉన్నారు

    తన తండ్రి బోని కపూర్ గురించి మాట్లాడుతూ మేమంతా కలసి ఉన్నందుకు నాన్న సంతోషంగా ఉన్నారు. అర్జున్ కపూర్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నసంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కూడా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.

    English summary
    Arjun Kapoor on life after Sridevi’s death. Arjun Kapoor has spoken at length about his new equation with his half sisters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X