ముదురు బ్యూటీతో యంగ్ హీరో ప్రేమాయణం: పెళ్లిపై ఎట్టకేలకు నోరు విప్పాడు...
బాలీవుడ్ ప్రేమ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకోబోతున్నట్లు గత నెల రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరి వివాహం జూన్ మాసంలోనే జరుగబోతోందని, ఆల్రెడీ మలైకా, అర్జున్ తమ స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీలు కూడా చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
తమ పెళ్లి గురించి అర్జున్ కపూర్, మలైకా అరోరా ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయకపోయినా బాలీవుడ్ మీడియా ఓ రేంజిలో హడావుడి చేసింది. అయితే తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు అర్జున్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

మీ వివాహం జూన్లో జరుగబోతోందా?
మీ వివాహం జూన్లో జరుగబోతోందా?... అనే ప్రశ్నకు అర్జున్ కపూర్ రియాక్ట్ అవుతూ ‘అది నిజం కాదు, నా వయసు 33 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే తొందర లేదు' అని స్పష్టం చేశారు.

ఆ రూమర్ల గురించి మీరే చెప్పాలి...
‘‘నా పెళ్లి గురించి వార్తలు ఎలా వస్తున్నాయనేది మీడియా వారే చెప్పాలి. ఎందుకంటే వాటిని క్రియేట్ చేసింది వారు. నిజంగా నేను పెళ్లి చేసుకుంటే చెబుతాను. ప్రస్తుత రోజుల్లో అలాంటి విషయాలు దాచాలన్నా దాగవు.'' అని అర్జున్ కపూర్ అన్నారు.

హానికలగనంత వరకు భరిస్తా
నాపై వచ్చే రూమర్స్ నాకు హాని చేయనంత వరకు భరిస్తా. వాటిపై ప్రతిసారీ స్పందించడం కూడా సాధ్యం కాదు. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు గాసిప్స్ అనేవి సర్వసాధారణం. అందుకే వాటిని లైట్ తీసుకుంటాను అన్నారు అర్జున్ కపూర్.

పెళ్లి అనేది బిగ్ కమిట్మెంట్
పెళ్లి అనేది చాలా పెద్ద కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ తీసుకునేందకు తాను సిద్ధమైనపుడే దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదని అర్జున్ కపూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో వెడ్డింగ్ సీజన్ నడుస్తోందని, వారు అందుకు సిద్దమయ్యారు కాబట్టే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.

తన ప్రేయసి మలైకా అరోరా గురించి
మలైకా అరోరా మీకు చాలా స్పెషలా? అనే ప్రశ్నకు... ‘అవును, ఆమె నాకు చాలా స్పెషల్' అని సమాధానం ఇచ్చారు. ఆమె గురించి మాట్లాడటానికి, దాచి పెట్టడానికి ఏమీ లేదు. ఈ ప్రపంచానికి అంతా తెలుసు. మన చుట్టూ మనకు ఇష్టమైన వ్యక్తులు ఉంటే జీవితం బావుంటుంది. నా జీవితంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు అని అర్జున్ కపూర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











