ధడక్ సినిమాపై అర్జున్ కపూర్ రివ్యూ.. చెల్లి నటన గురించి, మాటల్లేకుండా!
Recommended Video

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే జాన్వీ కపూర్ ఎలా చేసింది అనే ఉత్కంఠే అందరిలో నెలకొని ఉంది. జాన్వీ కపూర్ కు ఏ చిత్రం కీలకం. స్టార్ వారసురాలిగా జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అందరి చూపు ఆమె పైనే ఉంది. కాగా అర్జున్ కపూర్ తన సోదరి చిత్రంపై స్పందించాడు. చిత్ర ప్రీమియర్ షో చూశాక ట్విట్టర్ ద్వారా జాన్వీ కపూర్ ని ప్రశంసలతో ముంచెత్తాడు.

అడుగడుగునా
శ్రీదేవి మరణించిన తరువాత అర్జున్ కపూర్ అడుగడుగునా జాన్వీకి అండగా నిలుస్తున్నాడు. ధఢక్ చిత్రం విషయంలో జాన్వీ కపూర్ ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ట్రైలర్ విడుదలైన సమయంలోనే అర్జున్ కపూర్ జాన్వీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

అర్జున్ కపూర్ రివ్యూ
ధఢక్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అర్జు కపూర్ చిత్రం గురించి తనదైన శైలిలో స్పందించాడు. గుండెల్ని పిండేసే ప్రేమ కథ అని అభివర్ణించాడు. చిత్ర దర్శకుడు శశాంక్ ఖైతాన్ హీరో ఇషాన్, జాన్వీ నుంచి అద్భుతమైన ప్రదర్శన రాబట్టాడని ప్రశంసించాడు.

మాటల్లేకుండా చేసింది
ఇషాన్ ఖట్టర్ సాధారణ యువకుడిగా అద్భుతంగా నటించాడని అర్జున్ కపూర్ ప్రశంసించాడు. ఇక తన చెల్లి గురించి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ప్రేమ కథలో జాన్వీ నటన మాటల్లేకుండా చేసింది అంటూ పొగడ్తల వర్థం కురిపించాడు.

సైరాత్ రీమేక్
ధఢక్ చిత్రం సైరాత్ కు రీమేక్ గా తెరకెక్కింది. తొలి జాన్వీ ప్రశంసల అందుకోవడం ఆమె కుటుంబ సభ్యులు గర్వపడే అంశం. జాన్వి కపూర్ ని బాలీవుడ్ హీరొయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











