విడాకులైన హీరోయిన్‌తో హీరో ఎఫైర్ బెడిసి కొట్టిందా?
బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య కొంతకాలంగా నడుస్తున్న సంబంధం హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ముగిని ఉన్నారు. ఒకే ఇంట్లో సహజీవనం చేయడం, జంటగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరు కావడంతో మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు.
ప్రేమలో పడటం సర్వసాధారణమే అయినా... మలైకా అరోరా ఇంతకు ముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం, తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో 'సం'బంధం కొనసాగిస్తుండటం వీరి ఎఫైర్ మరింత ప్రత్యేకంగా మారింది.

సంబంధం బెడిసి కొట్టిందా?
తాజాగా అర్జున్ కపూర్ చేసిన వ్యాఖ్యలు... మలైకాతో అతడి ఎఫైర్ బెడిసి కొట్టినట్లు స్పష్టం చేస్తోంది. ఈ వాలంటైన్స్ డేకు అతడు సింగిల్‌గానే గడిపినట్లు బాలీవుడ్ మీడియా టాక్. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటనేది తెలియరాలేదు.

వివాదాలకు కారణమైన ఎఫైర్
వీరి ఎఫైర్ బాలీవుడ్లో పలు వివాదాలకు కారణమైనట్లు, సల్మాన్ ఖాన్.. అర్జున్ కపూర్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. మలైకా గతంలో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

అపుడు చెల్లితో.. ఇపుడు ఈవిడతోనా?
అర్జున్ కపూర్ గతంలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్‌తో డేటింగ్ చేశాడు. ఆమెతో బ్రేకప్ అయిన తర్వాత కొంతకాలానికి మలైకాతో రిలేషన్ మొదలు పెట్టాడు. అందుకే సల్మాన్ ఖాన్‌కు ఆగ్రహం వచ్చిందనే వార్తలు సైతం గతంలో ప్రచారంలోకి వచ్చాయి.

అర్జున్ కపూర్
అర్జున్ కపూర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘సందీప్ ఔర్ పింకీ పరార్', ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్', ‘పానిపట్' చిత్రాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











