కాబోయే భార్యపై ఎవరూ మీద పడకుండా.. హాట్ బ్యూటీపై కుర్ర హీరో కేరింగ్!
Recommended Video

యంగ్ హీరో అర్జున్ కపూర్, హాట్ బ్యూటీ మలైకా అరోరా వ్యవహారం ఇప్పుడంతా పబ్లిక్ అయిపోయింది. ప్రేమకు వయసు అడ్డుకాదు అనే సిద్ధాంతాన్ని వీరిద్దరూ బలంగా విశ్వసించినట్లు ఉన్నారు. మలైకా వయసు 45 ఏళ్ళు. ఆల్రెడీ పెళ్ళై భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. ఈ ముదురు సుందరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. చాలా కాలంగా మలైకా అరోరా అర్జున్ కపూర్ తో ఘాటు ప్రేమలో మునిగితేలుతోంది. త్వరలో వీరిద్దరూ పెళ్ళికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో వీరిద్దరూ బయట పబ్లిక్ గా తిరుగుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది.

డిన్నర్‌లో సందడి
గత రాత్రి అర్జున్ కపూర్, మలైకా అరోరా ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద తళుక్కుమని మెరిశారు. డిన్నర్ కోసం వీరిద్దరూ ఈ రెస్టారెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. డిన్నర్ ముగించుకుని బయటకు వెళ్లే సమయంలో అర్జున్ కపూర్, మలైకా జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాబోయే భార్యపై చేతులు వేసి
రెస్టారెంట్ బయట అర్జున్ కపూర్, మలైకా కనిపించగానే ఈ జంటని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కెమెరాల నుంచి తప్పినందుకునేందు మలైకా తల కిందకు వంచి ముందుకు సాగింది. జనాలు ఎగబడుతుండడంతో మలైకాపై ఎవరూ పడకుండా అర్జున్ కపూర్ జాగ్రత్త తీసుకున్నాడు. ఆమె భుజాలపై చేతులు వేసి జాగ్రత్తగా కారు వద్దకు తీసుకుని వెళ్ళాడు.

వచ్చే ఏడాది పెళ్లి
అర్జున్ కపూర్, కపూర్ మలైకా అరోరా వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ జంటగా కనిపిస్తుండడంతో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి.

గత ఏడాదే
గత ఏడాదే మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. అంతకు ముందు నుంచే మలైకా అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్నట్లు ఓ టాక్. మలైకా, అర్భాజ్ ఖాన్ బంధానికి తెరపడడానికి వీరిద్దరి రిలేషన్ కూడా ఓ కారణం అనే రూమర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











