ఇద్దరు పిల్లలున్న నటితో హీరో ఎఫైర్.. ఆమె అనుభవమే పనికొస్తుందంటూ షాకిచ్చాడు.!

By Manoj Kumar P

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌లు సర్వసాధారణం. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే... హిందీ పరిశ్రమలో ఇవి కొంచెం ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో వచ్చిన వార్తలను బట్టి ఇది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా మంది ఎఫైర్లు నడిపి హాట్ టాపిక్ అయ్యారు. వారిలో స్టార్ హీరో అర్జున్ కపూర్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి కారణం ఆ హీరో ఇద్దరు పిల్లలున్న నటితో డేటింగ్ చేయడమే. తాజాగా అతడు తాను ఎఫైర్ నడుపుతున్న నటి గురించి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ సంగతులు మీకోసం.!

శ్రీదేవి భర్త కుమారుడు.. చాలా టాలెంటెడ్

శ్రీదేవి భర్త కుమారుడు.. చాలా టాలెంటెడ్

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడే అర్జున్ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతోన్న ఇతడు.. 17 ఏళ్ల వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌జాదే' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు.

శ్రీదేవి పిల్లలకు అండగా ఉంటానని హామీ

శ్రీదేవి పిల్లలకు అండగా ఉంటానని హామీ

తన తండ్రి రెండో భార్య అయిన శ్రీదేవి, ఆమె పిల్లలతో అర్జున్ కపూర్ అంతగా కలిసే వాడు కాదు. దీంతో వాళ్ల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, శ్రీదేవి మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో అర్జున్ కపూర్ సొంత కొడుకులా వ్యవహరించాడు. అంతేకాదు, ఆమె పిల్లలకు అండగా ఉంటానని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.

ఇద్దరు పిల్లలున్న నటితో అర్జున్ ఎఫైర్

ఇద్దరు పిల్లలున్న నటితో అర్జున్ ఎఫైర్

కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య, ప్రముఖ నటి మలైకా అరోరాతో అతడు ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు, వీళ్లిద్దరికి వయసులో 12 ఏళ్ల తేడా కూడా ఉంది. దీంతో అర్జున్ కపూర్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు.

పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేశారు

పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేశారు

తమ బంధం బయటపడడంతో అర్జున్ కపూర్ - మలైకా అరోరా బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ ముంబై నగర శివార్లలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, అక్కడ కాపురం కూడా పెట్టేశారు. అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోడానికి ఇష్ట పడని మలైకా... అర్జున్‌తో మాత్రం డేటింగ్ చేస్తూ కాలం వెల్లదీస్తోంది.

 వివాహం వద్దు... ఎంజాయ్ చేయడమే ముద్దు

వివాహం వద్దు... ఎంజాయ్ చేయడమే ముద్దు

ప్రస్తుతం అర్జున్ కపూర్ వయసు 34 ఏళ్లు. దీంతో ఇంట్లో అతడిని పెళ్లి చేసుకోమన్న ఒత్తిడులు ఉన్నాయట. అతడు మాత్రం మలైకా నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడని తెలిసింది. ఆమె మాత్రం విడడాకుల కారణంగా పెళ్లి మీద ఆసక్తి లేదని, ఎప్పటికీ ఇలాగే ఉండిపోదామని చెబుతున్నట్లు బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Allu Arjun got Emotional Over Lighting Up Indian Flag on Swiss Alps
ఆమె అనుభవమే పనికొస్తుందంటూ షాకిచ్చాడు

ఆమె అనుభవమే పనికొస్తుందంటూ షాకిచ్చాడు

తాజాగా అర్జున్ సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘మీరు మలైకాలో ఏం చూసి ఇష్టపడ్డారు' అని అడిగాడు. దీనికి ‘ఆమె అనుభవమే' అని బదులిచ్చాడు. ఆ తర్వాత దానిని వివరిస్తూ.. ‘నాకు షార్ట్ టెంపర్. నన్ను భరించడం చాలా కష్టం. కానీ, ఆమె వయసులో పెద్దది కావడం.. గతంలో భర్తను డీల్ చేసిన అనుభవం ఉండడంతో నన్ను బాగా చూసుకుంటోంది. అదే నాకు బాగా నచ్చింది' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X