For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Arjun Kapoor: 48ఏళ్ళ నటితో రంజుగా డేటింగ్.. పెళ్లి అవసరమా? రొమాన్స్‌తో సరిపెట్టుకొ అంటున్న హీరో!

  |

  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇటీవల కాలంలో చాలా కామన్ గా మారిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా పెళ్లి అయినా కాకపోయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితాన్ని ఇష్టం ఉన్నట్లుగానే కొనసాగిస్తున్నారు. ఇక ఒక వ్యక్తితో ప్రేమలో లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకపోయినా కూడా వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలగకుండా కొనసాగుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇక 48 ఏళ్ల నటితో యువ హీరో అర్జున్ కపూర్ ఏ స్థాయిలో కలిసి కొనసాగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు అతని పెళ్లి పై వివరణ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ కి గురిచేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు

  బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు

  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో అర్జున్ కపూర్ మొదట్లో చాలా హడావిడిగా సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు దక్కడం లేదు. మూడు పదుల వయసు దాటినా ఇంకా అతనికి ఎలా నటించాలో అనుభవం రాలేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా బ్యాక్ గ్రౌండ్ కారణంగా నిత్యం ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగానే కనిపిస్తూ ఉంటాడు.

   నటితో డేటింగ్

  నటితో డేటింగ్

  అయితే అర్జున్ కపూర్ మాత్రం ఎక్కువగా మీడియాలో వైరల్ గా మారింది మాత్రం గ్లామరస్ బ్యూటీ మలైకా అరోరా కారణంగానే అని చెప్పవచ్చు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ఎవరికి తెలియని విధంగా వారి రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నారు. చాలాసార్లు మీడియా ముందు కంటపడినప్పటికీ కూడా వారి ప్రేమ వివాహం పై పెద్దగా స్పందించింది అయితే లేదు.

   మలైకా అలా.. అర్జున్ ఇలా

  మలైకా అలా.. అర్జున్ ఇలా

  మలైకా అరోరా అర్జున్ కపూర్ కు మధ్య వయసు రిత్యా చాలా తేడా ఉంది. మలైకా అతనికంటే 11 ఏళ్లు పెద్ద అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా చాలా రోజులుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. మలైకా అప్పుడప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను అనే హింట్ ఇస్తోంది కానీ అర్జున్ కపూర్ అయితే తన పెళ్లి గురించి మాత్రం ఎక్కడా కూడా ఆఫీషియల్ గా స్పందించింది లేదు.

  ఓకే ఫ్లాట్ లో..

  ఓకే ఫ్లాట్ లో..

  తనకు డేటింగ్స్ ఇష్టమని వయసుతో సంబంధం లేకుండా ఇష్టం ఉన్న వారితో ప్రేమగా ముందుకు సాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అర్జున్ కపూర్ అప్పట్లో ఒక బలమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే అతను లాక్డౌన్ సమయంలో ఎక్కువగా మలైకా తోనే జీవనాన్ని కొనసాగించాడు. ఇద్దరు కలిసి ఒకే ప్లాట్ లో ఉండడం ఆ తర్వాత కరోనా రావడంతో వీరికి సంబంధించిన వార్తలు కూడా చాలానే వచ్చాయి.

   పెళ్లి పై కామెంట్

  పెళ్లి పై కామెంట్

  ఇక రీసెంట్ గా అర్జున్ కపూర్ మరొక స్టేట్మెంట్ తో మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆమెతో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్న ఎదురవుతూ ఉండడంతో అసలు అలాంటి వార్తలు మీడియాలో ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగానే ఈ హీరో స్పందించడం విశేషం. కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న అర్జున్ కపూర్ ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమా కెరియర్ పైనే ఉంది అన్నట్లుగా వివరణ ఇచ్చాడు.

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
  మలైకా ఎలా రియాక్ట్ అవుతుందో?

  మలైకా ఎలా రియాక్ట్ అవుతుందో?

  లాక్ డౌన్ సమయంలోనే చాలా గ్యాప్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాను అని ప్రస్తుతం సినిమాలతో బిజీ అవ్వడానికి నటుడిగా మంచి గుర్తింపును అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్జున్ కపూర్ తెలియజేశాడు. ఇక తన పెళ్లి విషయంలో మీడియా ఎందుకు అంత హడావుడి చేస్తుందో తనకు అర్థం కావడం లేదు అని ఏదేమైనా కూడా ఇప్పుడు మాత్రం తాను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను అని అర్జున్ కపూర్ వివరణ ఇచ్చాడు. అయితే అతను అలా స్టేట్మెంట్ ఇవ్వడంతో మాత్రం సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఇన్ని రోజులు మలైకాతో ఇష్టం ఉన్నట్లు తిరిగేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి ఆ విషయంపై మలైకా ఎలా స్పందిస్తుందో చూడాలి

  English summary
  Arjun Kapoor shocking comments on marriage with malaika arora at koffee with karan show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X