twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Malaika Arora: మా జీవితాలతో ఆడుకోకండి.. ప్రెగ్నెన్సీ వార్తలపై యువ హీరో సీరియస్

    |

    బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలో మునిగి తేలుతున్న జంటలలో మలైకా అరోరా - అర్జున్ కపూర్ ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ కూడా నేటి తరం యువజంట తరహాలోనే ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ నైట్ పార్టీలకు అలాగే వివిధ రకాల సినిమా ఈవెంట్స్ లలో కలిసి కెమెరాలకు పోజులిస్తూ ఉంటారు. ఇక ఇటీవల మలైకా ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు రాగానే అర్జున్ కపూర్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    డేటింగ్ పెళ్లి వార్తలు

    డేటింగ్ పెళ్లి వార్తలు

    ఇక గత కొన్నిల్లుగా అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు అయితే ఇప్పటికే చాలాసార్లు వైరల్ అయ్యాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వారు ఇద్దరు కూడా కొన్నిసార్లు హింట్ అయితే ఇచ్చారు. కానీ మళ్ళీ అదేమీ లేదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మలైకా ఆరోరా అయితే చాలా సార్లు మీడియాను ఫూల్స్ ను కూడా చేసింది.

    పెళ్లి అయ్యిందని..

    పెళ్లి అయ్యిందని..

    ఇక పెళ్లికి సంబంధించిన వార్తలు ఎన్ని వస్తున్నా కూడా వీరు దాన్ని మాత్రం నిజం చేయడం లేదు. ఇక అప్పుడప్పుడు అర్జున్ మాత్రమే ఇప్పట్లో తను పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని కాస్త ఓపెన్ గా చెప్పుకుంటూ వస్తున్నాడు. దాదాపు గత ఏడాదిలోనే వీరి పెళ్లి అయిపోయిందని కూడా ఒక టాక్ అయితే వినిపించింది కానీ అందులో మళ్ళీ ఎలాంటి నిజం లేదు అని అర్థమైంది.

     మలైకా ప్రెగ్నెంట్

    మలైకా ప్రెగ్నెంట్

    అయితే చాలాకాలంగా అర్జున్ కపూర్ మలైకా ఇద్దరు కూడా ముంబైలోనే ఒక ఫ్లాట్లో ఉంటున్నట్లుగా టాక్ వచ్చింది. గతంలో కరోనా సమయంలో వీరిద్దరూ ఒకే ప్లాట్లో ఉండగా కరోనా వచ్చినట్లు క్లారిటీ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో ఉన్నారు అని అందుకే మలైకా ప్రెగ్నెంట్ అయినట్లుగా కూడా మళ్ళీ బాలీవుడ్ మీడియాలో చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

    అర్జున్ కపూర్ సీరియస్

    అర్జున్ కపూర్ సీరియస్

    ఇక ప్రెగ్నెంట్ వార్తలు వైరల్ కావడంతో అర్జున్ కపూర్ అందుకు సంబంధించిన వార్తలపై ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అలాగే ఆ కథనాలను ప్రచారం చేసిన వెబ్ మీడియాపై కూడా అతను తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చాలాకాలంగా ఆ ప్రముఖ జర్నలిస్ట్ ఇదే తరహాలో కథనాలను ప్రచారం చేస్తుంది అని మేము సైలెంట్ గా ఉండడం వల్లనే ఈ తరహా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి అని అన్నాడు. అంతేకాకుండా ఇందులో ఎలాంటి నిజం లేదు అని అనవసరంగా మా జీవితాలతో ఆడుకోకండి అంటూ తమ వ్యక్తిగత జీవితానికి కాస్త స్వేచ్ఛను ఇవ్వండి అని కూడా అర్జున్ కపూర్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Arjun kapoor shocking counter to malaika arora pregnancy news
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X