twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    48 ఏళ్ళ మలైకా అరోరాతో పెళ్లి.. యువ హీరో షాకింగ్ రియాక్షన్!

    |

    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. మరొక జంట కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. గ్లామరస్ బ్యూటీ మలైకా అరోరా కూడా మరోసారి పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె తన పెళ్లి పై స్పందించిన విధానంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆమె కంటే దాదాపు పదేళ్లు చిన్నవాడు అయినటువంటి అర్జున్ కపూర్ తన వివాహం జరగనుందట. అయితే ఈ వార్తలపై మొత్తానికి అర్జున్ కపూర్ చాలా భిన్నంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదట అతనితో..

    మొదట అతనితో..

    ఐటెమ్ సాంగ్స్ తో బాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్న మలైకా అరోరా దాదాపు అందరు హీరోలతో కూడా స్పెషల్ డాన్స్ లతో మెప్పించింది. అయితే ఈ బ్యూటీ మొదట సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ ను ఇష్టపడి పెళ్లి చేసుకొని కొన్నేళ్ల అనంతరం విడిపోయింది. ఈమెకు 20 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు.

    ఈ వయసులో కూడా..

    ఈ వయసులో కూడా..

    ఇక నాలుగు పదుల వయసులోకి వచ్చిన అనంతరం కూడా మలైకా అరోరా తన గ్లామర్ విషయంలో మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా అదే రేంజ్ లో హీటెక్కిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఆమె ఎదో ఒక హాట్ ఫొటోతో షాక్ ఇస్తూనే ఉంటుంది. అంతే కాకుండా ఇప్పటికి కూడా గ్లామరస్ సాంగ్స్ తో కూడా ఆమె ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

    యువ హీరోతో డేటింగ్

    యువ హీరోతో డేటింగ్

    ఇక ఈ బ్యూటీ సినిమాలు చేసినా చేయకపోయినా కూడా నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక గత కొంత కాలంగా అమ్మడు యువ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తనకంటే 12 ఏళ్ళ చిన్నవాడు అయినప్పటికీ మలైకా అరోరా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా అతనితో డేటింగ్ చేస్తోంది. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

    పెళ్లి ఫిక్స్?

    పెళ్లి ఫిక్స్?

    ఇక ఆ మధ్య వీరి వివాహానికి డేట్ ఫిక్స్ అయ్యిందని కూడా ఒక టాక్ వచ్చిమ విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో అయితే మలైకా అలాగే అర్జున్ ఇద్దరు కూడా ఒక ఫ్లాట్ లో ఉన్నారు. ఆ సమయంలో మలైకా కరోనా బారిన పడింది. ఇక అప్పుడే వీరికి పెళ్లి అయ్యే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. మలైకా కూడా త్వరలోనే కలిసి మరొక అడుగు ముందుకు వేయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

    అర్జున్ కపూర్ రియాక్షన్!

    అర్జున్ కపూర్ రియాక్షన్!

    ఇక ఈ ఎడాది నవంబర్ లో మలైకా అరోరా అర్జున్ కపూర్ పెళ్లి జరగనున్నట్లు వార్తలు రావడంతో వెంటనే అర్జున్ స్పందించాడు. 'లవ్.. నా లైఫ్ గురించి నా కంటే ఎక్కువగా అందరికి తెలుసని ఎలా అనిపిస్తుందో..' అని నవ్వుతున్న ఎమోజిని ఇన్స్టగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో మలైకాను అతను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడడం లేదా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి వీరి పెళ్లిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    arjun kapoor shocking reaction on his marriage news with malaika arora
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X