బాలీవుడ్ ‘ఎఫ్ 2’ రీమేక్: వరుణ్ తేజ్ పాత్రలో నటించేది ఎవరంటే...
తెలుగులో సూపర్ హిట్ అయిన 'ఎఫ్ 2' మూవీ బాలీవుడ్లో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో వరుణ్ తేజ్ పోషించిన పాత్రను హిందీలో బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ చేస్తారని టాక్.
తెలుగులో వెంకీ చేసిన పాత్రను బాలీవుడ్లో ఎవరైనా సీనియర్ స్టార్ హీరోతో చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ నిర్మాణంలో బోనీ కపూర్‌తో పాటు దిల్ రాజు కూడా భాగం అవుతుండటంతో భారీ టార్గెట్ దిశగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రూ. 130 కోట్లకుపైగా రాబట్టిన 'ఎఫ్ 2' స్థాయి బాలీవుడ్లో ఎలా ఉండబోతోందో చూడాలి.

బాలీవుడ్ మీడియాతో బోనీ కపూర్ కొన్నిరోజుల క్రితం మాటక్లాడుతూ... 'ఎఫ్ 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న మాట నిజమే అని, కానీ ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక జరుగలేదని... కథకు సూటయ్యే హిందీ స్టార్ల గురించి చూస్తున్నాం. దర్శకుడిగా అనీస్ బజ్మీ ఖరారయ్యారు. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
'ఎఫ్ 2 అనేది ఫన్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎంటర్టెనర్. నేను ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి వినోదాత్మక, కుటుంబ కథా చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులు అందిస్తే బావుంటుంది అనిపించింది. హిందీలో ఇద్దరం కలిసి నిర్మిద్దామని దిల్ రాజు అడిగారని బోనీ చెప్పుకొచ్చారు.
'ఎఫ్ 2' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా... వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ప్లస్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంచలన విజయం అందుకుంది.


Click it and Unblock the Notifications











