Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ బయోపిక్‌లో అనవసరంగా నటించా.. అతడి పాత్ర చేసినందుకు అసహ్యంగా ఉంది!
నటీనటులకు కొన్ని చిత్రాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. మరికొన్ని చిత్రాలు నిరాశని కలిగిస్తాయి. విజయం సాధించకపోయినా తమ కెరీర్ లో కొన్ని చిత్రాలు మెమొరబుల్ ఫిలిమ్స్ గా మిగిలిపోతాయని దర్శకులు, నటులు చెబుతుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ మాథుర్ తాను నటించిన బయోపిక్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ మాథుర్ తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ విడుదలయింది. ఈచిత్రంపై అర్జున్ మాథుర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు విజయ్ రత్నాకర్ తెరకెక్కించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్రలో నటించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో జర్మన్ నటి సుజన్నే సోనియా గాంధీ పాత్రలో నటించింది. ఇక అహానా కుమ్ర ప్రియాంక గాంధీ పాత్రలో, అర్జున్ మాథుర్ రాహుల్ గాంధీ పాత్రలో నటించారు.
నా మీద నాకే అసహ్యం
అర్జున్ మాథుర్ ఇటీవల ఓ టివి షోలో పాల్గొని ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ చిత్రంలో అనవసరంగా నటించా. రాహుల్ గాంధీ పాత్రలో నటించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. సంజు, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రెండు చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదని అర్జున్ మాథుర్ వ్యాఖ్యానించారు.
మంచి నటుడు కాదు
అర్జున్ మాథుర్ కు ఆ షోలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ లో నటించడం చేతకాకపోయినా ఫేమస్ అయిన హీరో ఎవరు అని ప్రశ్నించగా.. సిద్దార్థ్ మల్హోత్రా మంచి నటుడు కాదని అర్జున్ మాథుర్ తెలిపారు. అయినా కూడా బాలీవుడ్ లో స్టార్ అయ్యాడని అర్జున్ పేర్కొన్నాడు. అర్జున్ మాథుర్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాలతో రాణిస్తున్నాడు.
అసిస్టెంట్ డైరెక్టర్
అర్జున్ మాథుర్ తన కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో నటించిన లక్ బై ఛాన్స్ అనే చిత్రం అర్జున్ కి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా అర్జున్ నటించాడు. మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ నటుడిగా అర్జున్ స్థాయిని పెంచింది. బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే అర్జున్ వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టాడు.