హృతిక్ కాపురంలో చిచ్చు.. భార్యకు గుడ్‌బై.. మరో మహిళతో పట్టుబడ్డ అర్జున్ రాంపాల్!
Recommended Video

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇటీవల కాలంలో వివాదాల్లో బాగానే నానుతున్నాడు. గత కొద్దిరోజుల క్రితం 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికి భార్యకు దూరమయ్యాడు. గతంలో హృతిక్ రోషన్ దంపతులు విడిపోవడానికి కారణమని ఈయనపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం భార్యకు దూరంగా ఉంటున్న రాంపాల్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

మిస్టరీ ఉమెన్‌తో డిన్నర్
ఇలాంటి వార్తల మధ్య అర్జున్ రాంపాల్, మరో మహిళ ఆదివారం డిన్నర్ డేట్‌లో మీడియాకు పట్టుబడ్డారు. ఫోటోగ్రాఫర్లను చూడగానే వారు కొంత అయోమయానికి గురై వారిని తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే రాంపాల్‌తో ఉన్న మహిళ ఎవరన్నది మిస్టరీగా మారింది. ఫోటోగ్రాఫర్లు వెంటపడినప్పుడు ఆ అమ్మాయి ముఖాన్ని దాచుకొన్నారని చెప్పారు.

మీడియాను చూసి
విలాసవంతమైన హోటల్ వద్ద కనిపించిన వీరు ఫోటోగ్రాఫర్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే వారు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అర్జున్ రాంపాల్ కారును వేగంగా డ్రైవ్ చేయడం వల్ల యువతి ఫోటోను కెమెరాలో బంధించలేకపోయినట్టు సమాచారం.

భార్యతో సన్నిహితంగానే
తన భార్య మెహర్ జెసియాతో విడిపోయినప్పటికి వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. కూతుళ్లు మైరా, మహికాతో కలిసి ఇటీవల పారిస్‌కు విహారయాత్రకు కూడా వెళ్లారు. భార్యకు దూరంగా ఉంటున్నప్పటికీ పిల్లల కోసం వారు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్టు తెలిసింది.

హృతిక్ కాపురంలో చిచ్చు
గతంలో హృతిక్, సుజానే ఖాన్ దంపతులు విడిపోవడానికి కారణం అర్జున్ రాంపాల్ అనేది కాదనలేని వాస్తవమంటారు. సుజానే ఖాన్‌కు అర్జున్ రాంపాల్‌తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ కారణంగా సుజానేతో హృతిక్ విడాకులు తీసుకొన్నారనేది బహిరంగ వాస్తవం. ఇలాంటి వివాదానికి కారణం కావడంపై అప్పట్లో అర్జున్ రాంపాల్‌పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

పల్టాన్ చిత్రంలో
కెరీర్ పరంగా అర్జున్ రాంపాల్ అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం జేపీ దత్తా రూపొందిస్తున్న పల్టాన్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్నది. చివరిసారిగా రాంపాల్ డాడీ అనే చిత్రంలో గ్యాంగస్టర్ అరుణ్ గావ్లీ పాత్రను పోషించారు.


Click it and Unblock the Notifications











