మరో షాక్: 20 ఏళ్ల దాంపత్యం ముక్కలు, విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ జంట!
Recommended Video

కొన్ని రోజులుగా వినిపిస్తున్న వదంతులను నిజం చేస్తూ బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ రాంపాల్, అతడి భార్య మెహర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. వీరికి మహికా (16), మైరా (13) అనే కూతుర్లున్నారు. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ఓ ఆంగ్లపత్రికతో వెల్లడించిన ఈ జంట అందుకు గల కారణాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

20 ఏళ్ల అందమైన ప్రయాణం
మా 20 ఏళ్ల అందమైన ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇకపై మా ప్రయాణం కలిసి సాగదు. మా గమ్య స్థానాలు వేర్వేరు అని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అని అర్జున్ -మెహర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అయితే తమ పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలిపారు.

మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు
మా నిర్ణయాన్ని ఫ్యామిలీతో పాటు, పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో మేము ఇక ఎలాంటి ప్రకటనలు చేయదలుచుకోలేదు. మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దు అని ఈ సందర్భంగా వారు కోరారు.

అప్పటి నుండే విబేధాలు
1998లో అర్జున్-మెహర్ వివాహం జరిగింది. సుదీర్ఘ కాలం పాటు వీరు అనోన్య దంపతులుగా తమ హవా కొనసాగించారు. హృతిక్ రోషన్-సుజానె విడిపోయిన సమయంలో దానికి కారణం అర్జున్ రాంపాల్ అనే పేరు వినిపించింది. సుజానెతో అతడికి ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుండే అర్జున్ రాంపాల్, మెహర్ కాపురంలో కూడా విబేధాలు మొదలయ్యాయట.

బాలీవుడ్లో ఇలాంటివి ఇటీవల కాలంలో ఎన్నో
బాలీవుడ్లో ఇటీవల కాలంలో ఇలాంటి షాకింగ్ విడాకులు చాలా చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఏళ్ల తరబడి విజయవంతంగా దాంపత్య జీవితం కొనసాగించిన జంటలు విడిపోతున్నట్లు ప్రకటించారు. హృతిక్ రోషన్-సుజానే ఖాన్ తమ 14 ఏళ్ల దాంపత్య జీవితానికి 2016లో ముగింపు పలికారు.

హిమేష్ రేషిమియా-కోమల్
బాలీవుడ్ సింగర్, నటుడు హిమేష్ రేషిమియా తన భార్య కోమల్‌తో 22 ఏళ్ల దాంపత్య జీవితానికి 2016లో తెర దించారు. 2017లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.

అర్భాజ్ ఖాన్-మలైకా అరోరా
బాలీవుడ్ స్టార్ కపుల్ అర్భాజ్ ఖాన్-మలైకా అరోరా 2017లో విడిపోయారు. 18 ఏళ్ల పాటు సాగిన వీరి అన్యోన్య దాంపత్యం గతేడాది ముక్కలైంది.

పర్హాన్ అక్తర్-అధునా భబాని
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్హాన్ అక్తర్ తన భార్య అధునా భబానితో గతేడాది విడిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరు విడిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది.


Click it and Unblock the Notifications











