మొదటి భార్యకు సెటిల్ చేయకుండానే.. ప్రియురాలికి గర్భం.. డబ్బు విషయంలో!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. అర్జున్ రాంపాల్, ఆయన సతీమణి మెహర్ జెసియా 20 ఏళ్ల దాంపత్య జీవితానికి గత ఏడాది తెరపడింది. వీరిద్దరూ విభేదాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత అర్జున్ రాంపాల్ సౌత్ ఆఫ్రికాకు చెందిన మోడల్ గాబ్రియేలతో సహజీవనం ప్రారంభించాడు. కొన్ని రోజుల క్రితమే తన ప్రియురాలు గర్భం దాల్చిన విషయాన్ని అర్జున్ రాంపాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన మాజీ భర్త కొత్త జీవితం గురించి మెహర్ తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆరు నెలల క్రితమే
గత ఏడాది నుంచి అర్జున్ రాంపాల్, గాబ్రియేల సహజీవనం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితమే గాబ్రియేలా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అర్జున్ రాంపాల్, గాబ్రియేల ఈ విషయాన్ని దాచిపెడుతూనే వచ్చారు. కొన్ని రోజుల క్రితమే అర్జున్ రాంపాల్ తన ప్రియురాలు గర్భంతో ఉన్న విషయాన్ని ప్రకటించాడు. గాబ్రియేల, తాను కలసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దీనితో అర్జున్ రాంపాల్ 48 ఏళ్ల వయసులో మరోమారు తండ్రి అవుతున్నట్లు అయింది.

ఇంకా విడాకులు తీసుకోలేదు
అర్జున్ రాంపాల్ మొదటి భార్య మెహర్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అర్జున్ రాంపాల్, మెహర్ వేరు వేరుగా జీవిస్తున్నారు కానీ ఇంకా విడాకులు తీసుకోలేదు. అర్జున్ రాంపాల్, మెహర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మహిక వయసు 17 ఏళ్ళు కాగా రెండో కుమార్తె మ్యారా వయసు 13 ఏళ్ళు. గాబ్రియేల గర్భవతి అయిన విషయాన్ని మెహర్ తన సన్నిహితుల ద్వారా తెలుసుకుని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఆర్థిక పరమైన వ్యవహారాలు
అర్జున్ రాంపాల్ మరో మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై మెహర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని ఆమె సన్నిహితులు తెలిపారు. మెహర్, అర్జున్ రాంపాల్ మధ్య ఇంకా విడాకులు కూడా జరగలేదు. అధికారికంగా విడిపోయే ముందు ఆర్థిక పరమైన వ్యవహారాలు పక్కాగా సెటిల్ కావాలని మాత్రం మెహర్ భావిస్తోందట. అర్జున్ రాంపాల్, మెహర్ మధ్య ఇప్పటికీ ఆర్థిక పరమైన విషయాల గురించి చర్చ జరుగుతున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.

పిల్లల భవిష్యత్తు కోసం
భవిష్యత్తులో తన కుమార్తెలకు ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు మెహర్ అన్ని చర్యలు తీసుకుంటోంది. మెహర్ నుంచి విడిపోగానే అర్జున్ రాంపాల్ గాబ్రియేలతో డేటింగ్ మొదలు పెట్టాడు. వివాహం కాకుండా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఆఫ్రికాలో జన్మించిన గాబ్రియేలా ఇండియన్ మోడలింగ్ లో రాణిస్తోంది.


Click it and Unblock the Notifications











