డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్ బావమరిది అరెస్ట్.. జైలుకు తరలింపు!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బావమరిదిని ముంబైకి చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కొద్దికాలం క్రితం అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా దేశస్థుడైన డెమెట్రియాడెస్ ఏజిసిలాస్ గత కొద్దికాలంగా ముంబైలో ఉంటున్నాడు. అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్‌కు స్వయాన సోదరుడు డెమెట్రియాడెస్ అనే విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎజిసిలాస్, డెమెట్రియాడెస్‌పై 2021 సెప్టెంబర్‌లో వారెంట్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో గోవాలో డెమిట్రియాడెస్‌ను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకొన్నారు. అప్పటి నుంచి గోవాలో రిమాండ్‌లో ఉన్నారు. గోవాలోని బాంబే హైకోర్టు పలుమార్లు అతడి బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఏప్రిల్ 19న రిజెక్ట్ చేసింది. దాంతో అతడిని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించాలని ముంబై పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.

గతంలో డ్రగ్స్ కేసులో తన భాగస్వామి గ్యాబ్రిలా డెమెట్రియాడెస్‌ను అరస్ట్ చేసిన తర్వాత అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్సీబీ విచారించింది. ఉత్తర గోవాలోని వారి ఇంటి నుంచి హాషిష్, చరస్ కొంత మొత్తంలో సీజ్ చేశామని అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖేడే తెలిపారు. ఆ సమయంలో ఎజిసిలాస్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడికి తరలించారు. ఆ తర్వాత డెమెట్రియాడెస్ ఏజిసిలాస్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన కేసులో బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేయడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











