ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు... ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!
''ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు'' అంటూ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అర్దనగ్న ఫోటోను షేర్ చేస్తూ అతడి ప్రియురాలు గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ చేసిన కామెంట్ ఇది. కట్ చేస్తే... ఆమె ఇపుడు అతడి వల్ల గర్భవతి అయింది.
కొద్ది నెలల క్రితం అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడి జీవితంలోకి గ్యాబ్రియెల్లా ప్రవేశించింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.
తన గర్ల్ ఫ్రెండ్ గర్భం దాల్చిన విషయాన్ని అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఫోటో షేర్ చేసిన అర్జున్ రాంపాల్
త్వరలో మాకు బిడ్డ పుట్టబోతోంది. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలుపుతూ... అర్జున్ రాంపాల్ తన ప్రియురాలు గ్యాబ్రియెల్లాతో కలిసి దిగిన ఫోటోను అఫీషియల్ సోషల్ మీడియా జేజీ ద్వారా షేర్ చేశారు.

భార్యతో విడిపోయాక
అర్జున్ రాంపాల్ గతేడాది తన భార్య మెహర్ జెస్సియాతో విడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్‌తో ప్రేమలో పడ్డాడు. బాలీవుడ్ సర్కిల్‌లో ఈ జంట కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

ఇద్దరి మధ్య అలా పరిచయం
2009లో జరిగిన ఓ పార్టీలో వీరు తొలిసారి కలిశారు. అయితే అప్పుడు వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కేవలం స్నేహితులుగానే ఉన్నారు. గతేడాది అర్జున్ రాంపాల్ తల్లి చనిపోయిన తర్వాత ఆమె అతడికి తోడుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడింది.

ఆమె ఒక సూపర్ మోడల్
గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ సౌతాఫ్రికాకు చెందిన సూపర్ మోడల్. మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్ 2009లో పాల్గొన్నారు. ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ రిలీజ్ చేసిన ‘100 సెక్సియెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్' లిస్టులో చోటు దక్కించుకున్నారు. సోనాలి కేబుల్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు.

అర్జున్‌కు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు
అర్జున్ రాంపాల్, మెహర్ జెస్సియా 20 ఏళ్ల దాంపత్య జీవితం గతేడాది ముగిసింది. వీరికి మహిఖా, మైరా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. త్వరలో మహిఖా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











