Drug Case: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు షాక్.. కుటుంబ సభ్యుడి అరెస్ట్

డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు షాక్ ఇచ్చారు. ముంబై, గోవాకు చెందిన నార్కోటిక్ కంట్రోల్ అధికారుల జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో అర్జున్ రాంపాల్ ప్రియురాలు దక్షిణాఫ్రికాకు చెందిన గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్‌‌ సోదరుడు ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌ను అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీతారలను పశ్నించారు. డ్రగ్స్ సప్లయిర్స్‌తో సినీ తారల వాట్సప్ ఛాటింగ్‌ను బేస్ చేసుకొని ఎన్సీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆ క్రమంలోనే నవంబర్ 13వ తేదీన అర్జున్ రాంపాల్‌ ఇంటిపై మెరుపు దాడులు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను, కొన్ని ట్యాబ్‌లెట్లను స్వాధీనం చేసుకొన్నారు. సుమారు ఏడు గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.

తొలిసారి లోనావాలాలో దాడులు

తొలిసారి లోనావాలాలో దాడులు


ఆ తర్వాత అర్జున్ రాంపాల్ ప్రియురాలు గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్‌ సోదరుడు ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌కు సంబంధించిన లోనావాలాలోని నివాసంలో దాడులు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అర్జున్ రాంపాల్, గ్యాబ్రిలాను కూడా విచారణకు పిలిచి ప్రశ్నించారు.

డ్రగ్స్‌తో మూడోసారి పట్టుపడ్డ ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌

డ్రగ్స్‌తో మూడోసారి పట్టుపడ్డ ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌

అయితే డ్రగ్స్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌పై కొంతకాలంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దృష్టిపెట్టారు. అయితే గోవాలో డ్రగ్స్‌తోపాటు ఉన్నారనే సమాచారం అందగానే.. గోవాలోని నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పక్కా ప్లాన్‌తో శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకొన్నారు. అతడి వద్ద నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం.

ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌ అరెస్ట్‌పై ఎన్సీబీ

ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌ అరెస్ట్‌పై ఎన్సీబీ

అయితే ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌ అరెస్ట్‌ను ముంబై నార్కోటిక్ కంట్రోల్ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడి ధృవీకరించారు. శుక్రవారం రాత్రి ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌ను అరెస్ట్ చేశాం. డ్రగ్స్ సప్లయిర్స్‌ను టార్గెట్‌గా దాడులు నిర్వహించాం. ఆ దాడుల్లో ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌‌ను డ్రగ్స్‌తో గుర్తించాం. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాం. ఇప్పటికే ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌పై ఎన్సీబీ మూడు కేసులను నమోదు చేసింది అని సమీర్ తెలిపారు.

చిక్కుల్లో అర్జున్ రాంపాల్ ఫ్యామిలీ

చిక్కుల్లో అర్జున్ రాంపాల్ ఫ్యామిలీ


తాజాగా మూడోసారి కూడా ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌‌ అరెస్ట్ కావడంతో అర్జున్ రాంపాల్, ఆయన ప్రియురాలు సమస్యల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌‌‌ను ప్రశ్నిస్తూ ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. రానున్న రోజల్లో డ్రగ్స్ కేసులో మరింతగా ఉక్కుపాదం మోపేందుకు ముంబై నార్కొటిక్ అధికారులు సిద్దమవుతున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X