53 ఏళ్ల వయసులో హీరో రెండో పెళ్లి... ఇద్దరు పిల్లలున్న నటితో మ్యారేజ్‌కి రెడీ
ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. సమంత - రాజ్ నిడిమోరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన సన్నిహితురాలు గౌరీతో రిలేషన్‌ను ఆయన బహిరంగంగా బయటపెట్టారు. ఈ కోవలోనే మరో సీనియర్ నటుడు 54 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోడల్ నుంచి నటుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు అర్జున్ రాంపాల్. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దిల్ హై తుమ్‌హారా, దిల్ కా రిస్తా, వాడా, ఐ సీ యూ, అసంభవ్, రాయ్, యాకీన్, చక్రవ్యూహ్, డాడీ, ఇన్‌కాంర్, డాన్, ఓం శాంతి ఓమ్, హౌస్‌ఫుల్, రాజ్‌నీతి, రా వన్ తదితర చిత్రాలలో హీరోగా, విలన్‌గా, సహాయక నటుడిగా గుర్తింపు తెచ్చుచున్నారు. రెండేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలో విలన్ పాత్ర పోషించి తెలుగువారిని పలకరించారు అర్జున్ రాంపాల్. ఇటీవల రిలీజైన రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్‌లో మేజర్ ఇక్బాల్‌గా కీ రోల్ పోషించారు. ప్రస్తుతం దురంధర్ పార్ట్ 2, ది బ్యాటిల్ ఆఫ్ భీమ కోరెగావ్, నాస్తిక్, 3 మంకీస్ సినిమాలలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.

మెహర్‌తో విడాకులు
అర్జున్ రాంపాల్‌కు 1998లో మోడల్ మెహిర్ జెసియాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు మహికా, మైరా సంతానం. దాదాపు 20 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితానికి బీటలు పడింది. పరస్పర అంగీకారంతో మెహర్, అర్జున్‌లు విడిపోయారు. 2018లో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో బాలీవుడ్ షాకైంది. 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయని.. కానీ తామిద్దరం వేర్వేరు దారులలో ప్రయాణించాలని అనుకుంటున్నట్లు మెహర్ పేర్కొన్నారు.
పెళ్లి కాకుండానే తల్లిగా
మెహర్ జెసియాతో విడాకుల తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో ప్రేమలో పడిన అర్జున్ రాంపాల్ ఆమెతో సహజీవనం చేస్తున్నారు. తొలుత వీరిద్దరికి 2009 ఐపీఎల్ సెలబ్రేషన్స్ సమయంలో ఆమెతో తొలిసారిగా అర్జున్‌కి పరిచయం ఏర్పడింది. గాబ్రియెల్లా అప్పటికే మోడల్‌గా పాపులర్ కావడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలోనూ నటించారు. అక్కినేని నాగార్జున - కార్తీ నటించిన ఊపిరిలో ఓ స్పెషల్ సాంగ్‌లోనూ గాబ్రియెల్లా నటించారు. వివాహం కానప్పటికీ గాబ్రియెల్లా- అర్జున్ రాంపాల్‌లు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ( అరిక్, అరివ్) కూడా పుట్టారు.
త్వరలోను గాబ్రియెల్లాతో పెళ్లి
ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందోనని బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్‌కు రాంపాల్ తెరదించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే మా ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని త్వరలో పెళ్లి కూడా ఉంటుందని పేర్కొన్నారు. దాంతో అర్జున్- గాబ్రియెల్లాల పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఆరేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











