Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అర్జున్ రెడ్డి డైరెక్టర్ బాలీవుడ్ మూవీ.. ఆ ఒక్క విషయంలో తగ్గడం లేదట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమాతో దర్శకుడి స్థాయి ఏ రేంజ్ లో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మళ్ళీ అదే కథను బాలీవుడ్ లో రీమేక్ చేయగా సినిమా అక్కడ కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. దీంతో అతనికున్న క్రేజ్ బాలీవుడ్ లో మరింత పెరిగింది.
ఏకంగా రణ్ బీర్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఒక విషయంలో సందీప్ బాలీవుడ్ మేకర్స్ తో గట్టిగానే వాదిస్తున్నాడట. ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. అదేమిటంటే.. మీరు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ను తెచ్చినా కూడా నాకు పెద్దగా అభ్యంతరం లేదు. కానీ సినిమాకు మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడానికి నేను చెప్పిన అతన్నే ఫిక్స్ చేసుకోవాలని మొహం మీదే చెప్పేస్తున్నాడట.
అర్జున్ రెడ్డి సినిమాకు రధన్ మ్యూజిక్ అందించగా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంధించాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో మళ్ళీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ కు పని చేసిన రమేశ్వర్ ను తదుపరి ప్రాజెక్టుకు కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. అతని విషయంలో సందీప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.