హిందీ వెర్షన్ ‘అర్జున్ రెడ్డి’ టైటిల్ ‘కబీర్ సింగ్’ (ఫస్ట్ లుక్)
తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
తాజాగా దీనికి 'కబీర్ సింగ్' అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ సైతం అర్జున్ రెడ్డిని తలపించేలా ఉండటంతో హిందీలో మక్కికి మక్కి దించుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇందులో అర్జున్ కపూర్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
షాహిద్ కపూర్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా విడుదల చేస్తూ జూన్ 21, 2019లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. మరో వైపు షాహిద్ కపూర్ రీసెంట్ ఫోటోస్ చూస్తే భారీ గడ్డంతో కనిపించారు. సో... అర్జున్ రెడ్డి తరహాలోనే ఇందులో షాహిద్ గడ్డంతో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై, ఢిల్లీ, ముస్సోరి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. టి సిరీస్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ కల్ట్ మూవీ హిందీలోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











