కబీర్ సింగ్ నోట.. మాదర్ XX.. హిందీ అర్జున్ రెడ్డి టీజర్ రిలీజ్.. షాహిద్ కేక!
Recommended Video

టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ విడులైంది. తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన పాత్రల్లో షాహీద్, కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మక్కీ కి మక్కీగా హిందీలో దించేసినట్టు టీజర్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

మెడికల్ సైన్స్ విద్యార్థిగా
ఢిల్లీ మెడికల్ సైన్సెస్‌కు చెందిన కబీర్ రాజ్ దేవ్ సింగ్ అనే అద్భుతమైన విద్యార్థి అంటూ టీజర్‌ను మొదలుపెట్టి హోళీ సీన్, ఆ తర్వాత ఫైట్ లాంటి టీజర్‌లో చూపించారు. మందు బాటిళ్లు, సర్జరీ, ఫుట్ బాల్ గేమ్ సీన్లు మళ్లీ ఓసారి అర్జున్ రెడ్డి ఫ్యాన్స్‌లో జోష్ పెంచేలా ఉన్నాయి. మంచి విద్యార్థి, ఓ ప్రేమికుడు, రెబెల్‌గా ఎలా మారాడు అనే విషయాలను చూచాయగా చూపించారు.

మళ్లీ కాంట్రవర్సి డైలాగ్
ఇక తెలుగులో వివాదాస్పదంగా మారిన మదరో చోద్ డైలాగ్‌ను టీజర్ ఉంచి మరోసారి వివాదానికి తెర లేపే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. హిందీలో కూడా ఈ డైలాగ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా జూన్ 21న రిలీజ్ అవుతున్నది.

తమిళ్‌తో పోల్చితే బాగుంది
అర్జున్ రెడ్డి రీమేక్ వెర్షన్లలో తమిళ రీమేక్ టీజర్‌తో పోల్చితే హిందీ టీజర్ చాలా బాగుంది. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కావొచ్చు. తెలుగులో దర్శకత్వం వహించిన ఆయనే హిందీలో కూడా చేయడం సానుకూలతగా మారింది. అంతేకాకుండా షాహీద్ కపూర్.. అర్జున్ రెడ్డిగా బాగా సెట్ అయ్యాడు అనే ఫీలింగ్ తప్పక కలుగుతుంది.
టీజర్‌పై నెటిజన్ల కామెంట్లు
కబీర్ సింగ్ టీజర్ గురించి యూట్యూబ్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది. అర్జున్ రెడ్డి మాస్టర్ పీస్. అయితే హిందీ టీజర్ చూసిన తర్వాత కూడా ఇది కూడా మాస్టర్ పీస్ అవుతుంది. ఈ టీజర్ మరోస్థాయికి తీసుకెళ్తుంది అనే ఫీలింగ్ కలుగుతున్నది. ఒరిజినల్ అర్జున్ రెడ్డిని ఎవరూ బీట్ చేయరనే ఫీలింగ్ ఉండేది. కానీ కబీర్ సింగ్ అంచనాలను చేరుకొన్నాడు. విజయ్ దేవరకొండ అంటే ప్రేమ.. షాహీద్ కపూర్ అంటే గౌరవం అని నెటిజన్లు కామెంట్లు వదిలారు.


Click it and Unblock the Notifications











