‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నటుడితో విడాకులు.. ప్రాణం భయం ఉందంటూ
బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ రీసెంట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో ఈయన విలన్ గా మెప్పించారు. పఠాన్ అనే పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఆయన వ్యక్తిగత విషయంతో ఇప్పుడయాన పేరు వార్తల్లో నటించింది. తన మాజీ భార్య సీమా సజ్దే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా మారాయి.
అయితే సీమా సజ్దే - సోహైల్ ఖాన్ 2012లో విడిపోయారు. ఈ సందర్భంగా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ దృష్టిని ఆకర్షించాయి. ఆమె రీసెంట్ కామెంట్స్ ఇలా ఉన్నాయి. సీమా సజ్దే తన విడాకుల తర్వాత డేటింగ్‌లకు వెళ్లడం ఏమాత్రం బాగాలేదని చెప్పుకొచ్చింది. డివోర్స్ తీసుకున్న తర్వాత డేటింగ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అది నాకు చెత్తపనిగా అనిపించింది. కానీ చాలా మంది నా సెపరేషన్ తర్వాత చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు. మళ్లీ కొత్త లైఫ్ ప్రారంభించే దిశగా ప్రోత్సహించారు.

ఈ క్రమంలోనే కొత్త వ్యక్తితో వెళ్లి మంచి సమయం గడపమని, అతన్ని తరుచూ కలవమని, అతనితో మాట్లాడమని అన్నారు. కానీ నేను అప్పటి చాలా వరకు లా అండ్ ఆర్డర్ ను ఎదుర్కొని ఉండటంతో మళ్లీ డేటింట్ అంటే భయమేసింది. ఈ క్రమంలోనే డివోర్స్ తర్వాత అతను సీరియల్ కిల్లర్ గా మారి, చంపేస్తాడేమోనని భయపడ్డాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే మళ్లీ డేటింగ్ వార్తలపై ఇలా సీమా సజ్దే స్పందించింది. ఈతరంలో లాగా డేటింగ్ చేయడం నాకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది.
అయితే సోహైల్ ఖాన్ తో 3 ఏళ్ల కింద విడిపోయిన తర్వాత ప్రస్తుతం విక్రమ్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. దానికి సీమా సజ్దే ఇలా స్పందించింది. నేను జీవితంలోని గుణపాఠాలను చదువుకొని ఉన్నాను. నాకు ఈ రిలేషన్ షిప్ లు అంటే అర్థం కూడా తెలియదని చెప్పుకొచ్చింది. ఇక సోహైల్ ఖాన్ బాలీవుడ్ లో నటుడిగా, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. రైటర్ గా, డైరెక్టర్ గా 1998 నుంచే హిందీ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు.
బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, స్టైలిస్ట్ సీమా సజ్దేను 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఆర్య సమాజ్ లో జరగడం విశేషం. ఆ తర్వాత నిఖా చేసుకున్నారు. ఇక దాదాపు 24 ఏళ్ల పాటు వీరిద్దరూ వివాహ బంధాన్ని సాఫీగా కొనసాగించారు. కానీ ఉన్నట్టుండి 2022లో విడాకులు ప్రకటించారు. కోర్టు నుంచి విడాకులు కూడా పొందారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకులు నిర్వాన్, యోహన్ ఉన్నారు. వీరిద్దరూ సరోగసీ ద్వారా జన్మించారు. ఇక 2011లోనూ అస్లామ్ ఖాన్ కు జన్మనిచ్చారు. ప్రస్తుతం వారి వారి జీవితాలపై దృష్టి పెట్టారు. సోహైల్ ఖాన్ 55 ఏళ్లు ఉంటారు. ఇక సీమా సజ్దా 48 ఏళ్లు ఉంటుంది.


Click it and Unblock the Notifications











