అప్పుడు ప్రభాస్ పై నోటి దురుసు.. ఇప్పుడు చెంపలు వేసుకొన్న బాలీవుడ్ నటుడు

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో మన తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి బాహుబలి ఇచ్చిన ఫేమ్ తో ప్రభాస్ ఖండాంతరాల్లో తన స్టామినా చూపించి బిగ్ స్టార్ అయ్యాడు. కాగా ఇలా ప్రభాస్ తన పాన్ ఇండియా క్రేజ్ నుంచి పాన్ వరల్డ్ వరకు తన సినీ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటు వెళ్లే క్రమంలో తనకి పూలతో పాటుగా రాళ్ళ దెబ్బలు కూడా తప్పడం లేదు.

కాగా డార్లింగ్ హీరో రీసెంట్ గా చేసిన పాన్ ఇండియా సెన్సేషన్ కల్కి 2898 ఎడి కి కూడా చాలా నెగిటివ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాలో మెయిన్ హీరో అమితాబ్ అని ప్రభాస్ కి పెద్దగా స్కోప్ లేదని చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ వీటి అన్నిటినీ మించి పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయ్యింది మాత్రం బాలీవుడ్ నటుడు అలాగే క్రిటిక్ కూడా అయినటువంటి అర్షద్ వర్సీ చేసిన కామెంట్స్ అని చెప్పాలి. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ లా కనిపించాడు.

Arshad Warsi reacted on Prabhas over jocker remarks

ప్రభాస్ ఒక జోకర్ అంటూ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి తీశాయి. రెబల్ ఫ్యాన్స్ దెబ్బకి నేషనల్ వైడ్ గా ఇది న్యూస్ గా కూడా మారిపోయింది. అయితే దీనిపై నాచురల్ స్టార్ నాని కూడా అర్షద్ కి కౌంటర్ వేసాడు. ఇలా తర్వాత ఆగింది అనుకున్న ఈ కాంట్రవర్సీ పై మరోసారి వార్తలు మొదలయ్యాయి. ప్రభాస్ ని జోకర్ అంటూ వర్ణించిన అర్షద్ ఇప్పుడు చేసిన రీసెంట్ కామెంట్స్ ఆ తరహాలోనే అనిపిస్తున్నాయి.

తాను ఈసారి ఏమన్నాడంటే.. నేను ప్రభాస్ ని జోకర్ అనలేదు అని నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రభాస్ ని కల్కి లో అలా చూపించడం నచ్చలేదు లేదు అని అందుకే కల్కి సినిమాలో ప్రభాస్ చేసిన పాత్రని జోకర్ అంటూ అభివర్ణించాను అని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకున్నాడు. దీనితో సినీ వర్గాల్లో ఈ తాజా స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

మరి కామెంట్స్ అయితే కొంచెం పర్వాలేదు కానీ ప్రభాస్ రోల్ ని జోకర్ గా అన్న మాటకి తను ఇంకా కట్టుబడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా ఇప్పుడు ప్రభాస్ పలు భారీ చిత్రాలు చేస్తుండగా వీటిలో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Arshad Warsi reacted on Prabhas over jocker remarks

కాగా ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ నటిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రాబోతుంది. అలాగే ఈ సినిమా తర్వాత ప్రభాస్ దర్శకుడు హను రాఘవాపుడితో సినిమా అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమాలు వెంటనే స్టార్ట్ చేయనున్నాడు. కాగా వీటి తర్వాత అవైటెడ్ భారీ సీక్వెల్ చిత్రాలు సలార్ 2 అలాగే కల్కి 2898 ఎడి 2 ప్రభాస్ స్టార్ట్ చేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X