Aryan Khan అరెస్ట్ తర్వాత షారుక్ ఖాన్ డూప్‌తో దర్శకుడు అట్లీ.. నయనతారతో కలిసి అలా..!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ప్రతీ ఒక్కరు షాక్‌లో కూరుకుపోయారు. ముంబై నుంచి గోవాకు వెళ్లే ఓడలో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మెరుపుదాడులు చేసి ఆర్యన్‌ ఖాన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్‌ను కస్టడీలోకి తీసుకొని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే కొడుకు అరెస్ట్ తర్వాత దారుణంగా కుంగిపోయిన షారుక్ ఖాన్ గురించి వెలుగులోకి వచ్చిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..

కుమారుడు అరెస్ట్ సమయంలో స్వీడన్‌లో అంటూ

కుమారుడు అరెస్ట్ సమయంలో స్వీడన్‌లో అంటూ

తన కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ అయినప్పుడు షారుక్ ఖాన్ స్వీడన్‌లో జరుగుతున్న పఠాన్ షూటింగులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ముంబైలోనే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి 9 గంటల వరకు అట్లీ సినిమా షూట్‌లో షారుక్ పాల్గొన్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో ప్రియమణి, నయనతార, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

అట్లీ షూటింగ్ నుంచి షారుక్ బయటకు

అట్లీ షూటింగ్ నుంచి షారుక్ బయటకు

బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ జరిగిన సమయంలో ముంబైలోని బీడీ పెటిట్ పార్సీ జనరల్ హాస్పిటల్‌లో షారుక్ ఖాన్ షూటింగ్ చేస్తున్నారు. వార్త తెలిసిన వెంటనే షాక్ గురైన ఆయన వెంటనే షూటింగ్ నుంచి బయటకు వచ్చారు. తన కుమారుడి అరెస్ట్ నివారించేందుకు, అలాగే బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ అట్లీ మాత్రం ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు అని వెల్లడించారు.

షారుక్ ఖాన్ డూప్‌తో అట్లీ షూటింగ్

షారుక్ ఖాన్ డూప్‌తో అట్లీ షూటింగ్

ఇదిలా ఉండగా, అట్లీ రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో షారుక్ ఖాన్ డబుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్లో షారుక్ ఖాన్ డూప్ (బాడీ డబుల్) ప్రశాంత్ వాల్దేతో సన్నివేశాలు చిత్రీకరించారు. అచ్చు షారుక్‌ ఖాన్‌లా కనిపించే ప్రశాంత్‌ను పెట్టి సీన్లను చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఆర్టిస్టుల డేట్లు, సమయం, బడ్జెట్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్‌ కీలక సన్నివేశాలను అట్లీ చిత్రీకరించాలని నిర్ణయం తీసుకొన్నారు అని బాలీవుడ్ మీడియా తమ కథనాల్లో పేర్కొన్నారు.

20 రోజుల షూటింగ్ పూర్తి..

20 రోజుల షూటింగ్ పూర్తి..

షారుక్‌తో అట్లీ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షూటింగ్ పూర్తయింది. ఇంకా 180 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఒకే సమయంలో షారుక్ ఖాన్ పఠాన్ షూటింగ్‌ చేస్తుండటంతో ఈ రెండు యూనిట్లను బ్యాలెన్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్యన్ అరెస్ట్ జరగకపోతే షారుక్ ఖాన్ పఠాన్ కోసం స్వీడన్ వెళ్లాల్సింది. దీపకా పదుకోన్‌తో చిత్రీకరించే పాటలో షారుక్ పాల్గొనాల్సింది. కుమారుడి అరెస్ట్ కారణంగా పఠాన్ షూటింగ్‌ను వాయిదా వేశారు అని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

స్వీడన్‌లో దీపిక పదుకోన్‌తో షారుక్ డూప్ పాట?

స్వీడన్‌లో దీపిక పదుకోన్‌తో షారుక్ డూప్ పాట?

స్వీడన్‌లో దీపిక పదుకోన్‌తో జరిగే షూటింగ్‌కు వెళ్తున్నారా అని షారుక్ డూప్ ప్రశాంత్‌ను అడిగితే.. ఆ విషయం చెప్పడానికి నిరాకరించాడు. ప్రతీ షూటింగ్‌కు ఒక రోజు ముందు రాత్రి నాకు సమాచారం ఇస్తారు. అంతకంటే సినిమాకు సంబంధించిన విషయాలు నాకు చెప్పరు అని ప్రశాంత్ సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ కేసులో కుమారుడు అరెస్ట్ కావడం వల్ల షారుక్ ఖాన్‌పై ప్రజల్లో సానుభూతి పెరిగింది. కోవిడ్ కాలంలో ఆయన ఎంతో మందికి వ్యాక్సిన్స్ వేసే బాధ్యతను, పలు రకాల సేవలను అందించారు. షారుక్ ఖాన్‌లో మంచి తనం మాత్రమే చూడాలి అని ప్రశాంత్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X