For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aryan Khanకి మరో షాక్... బెయిల్ తిరస్కరణ..భయంకర ఖైదీలున్న జైలుకు తరలింపు.. వీకెండ్ అంతా జైల్లోనే ?

  |

  షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి మరో మారు షాక్ తగిలింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తు కోర్టు తిరస్కరించింది. దీంతో ఆర్యన్‌తో సహా నిందితులందరూ ఆర్థర్ రోడ్ జైలుకు పంపబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే

  ఐదురోజుల నుంచే

  ఐదురోజుల నుంచే

  డ్రగ్స్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న బాలీవుడ్‌ అగ్ర హీరో షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కి ఇంకా ఇబ్బందులు తగ్గలేదు. క్రూయిజ్ లోని పార్టీలో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలో ముంబయి పోలీసులు ఐదు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్యన్‌ ఖాన్‌ తన బెయిల్‌ కోసం ముంబయి కోర్ట్ని ఆశ్రయించారు.

  ఆర్యన్‌ ఖాన్‌కి నిరాశే

  ఆర్యన్‌ ఖాన్‌కి నిరాశే

  ఇక శుక్రవారం ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారించిన ముంబయి కోర్ట్ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇప్పటికే ఓసారి ఆర్యన్ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌ కోసం కోర్ట్ ని ఆశ్రయించారు. కానీ కోర్టు పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో మరోసారి బెయిల్ కోసం ఆయన తరపున న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు కోర్ట్ నిరాకరించింది. దీంతో మరోసారి ఆర్యన్‌ ఖాన్‌కి నిరాశే ఎదురయ్యింది.

  వీకెండ్ అంతా జైల్లోనే

  వీకెండ్ అంతా జైల్లోనే

  సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ పొందే ప్రక్రియ చాలా లెంతీ ప్రాసెస్ కావడంతో బెయిల్ పొందడానికి 2 రోజుల నుండి 20 రోజుల వరకు పట్టవచ్చని అంటున్నారు. అదీ కాక రేపు కోర్టుకు సెలవులు కావడంతో ఈ వీకెండ్ అంతా జైల్లోనే గడపనున్నారు. మేజిస్ట్రేట్ కోర్టులో సతీష్ మన్ షిండే మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. అయితే మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి, ఈ కేసును విచారించే మరియు బెయిల్‌పై చర్య తీసుకునే హక్కు దానికి లేదని చెప్పబడింది. ఈ విషయం సెషన్స్ కోర్టుకు సంబంధించినది, కాబట్టి ఆర్యన్ మరియు ఇతరుల న్యాయవాదులు సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించారని అంటున్నారు.

   ఆ పనిలో బిజీగా

  ఆ పనిలో బిజీగా

  ఇక ఈ పరిస్థితిలో సతీష్ మన్ షిండేతో సహా ఇతర న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఆర్యన్ ఖాన్ పిటిషన్‌ను ముంబై ఫోర్ట్ కోర్టు తిరస్కరిస్తూ ఆర్యన్ పిటిషన్ వాదించదగింది కాదని కోర్టు చెప్పింది, ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ మరియు ఇతర నిందితులందరూ ఈ రోజు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆర్థర్ జైలుకు వీరిని తరలించారు. ఇక కసబ్, అబూ సలేం, సంజయ్ దత్ వంటి వ్యక్తులను ఉంచిన జైలులో ఉంటోంది.

  భయంకరమైన ఖైదీలు ఉన్న జైల్లో

  భయంకరమైన ఖైదీలు ఉన్న జైల్లో

  ఆర్యన్ ఖాన్‌తో పాటు 5 మంది ఖైదీలు ముంబైలోని అతిపెద్ద జైలు అయిన ఆర్థర్ జైలులోని బ్యారక్ నంబర్ 1 లో ఉంచారు. ఇది జైలు మొదటి అంతస్తులో నిర్మించిన స్పెషల్ క్లోజ్డ్ బ్యారక్, ఇది క్వారంటైన్ బ్యారక్ అని అంటున్నారు. ఇక్కడ ఆర్యన్ ఖాన్ మరియు ఇతరులు 5 రోజులు నిర్బంధంలో ఉంచబడతారు. అయితే ఎవరూ యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదు కానీ వారు ఇతర ఖైదీల లాగా ట్రీట్ చేయబడతారు.

  కరోనా టెన్షన్ తో

  కరోనా టెన్షన్ తో

  ఆర్యన్ మరియు ఇతర 5 మంది ఖైదీలు జైల్లో ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా కరోనా లక్షణాలను కలిగి ఉంటే, అప్పుడు వారిని కరోనా టెస్ట్ కోసం పంపుతారు. ఈ కేసులో ఆర్యన్‌తో సహా మిగతావారి కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ అనివచ్చింది. ప్రతి ఒక్కరూ టీకా రెండు మోతాదులను తీసుకున్న కారణంగా, వారికి కేవలం 5 రోజుల క్వారంటైన్ ఇవ్వబడింది. మహిళా ఖైదీలను బైకుల్లా జైలుకు పంపారు.

  షారుఖ్ ఫ్యామిలీ ఆ పనిలో

  షారుఖ్ ఫ్యామిలీ ఆ పనిలో

  ఇక ఆర్యన్ జైలుకు చేరుకున్న తర్వాత బాధపడ్డాడని, ఎందుకంటే ఆర్థర్ రోడ్ జైల్లో చాలా మంది భయంకరమైన ఖైదీలు ఉన్నారని అంటున్నారు. ఇక ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మన్ షిండే రంగంలోకి దిగినా బెయిల్ దొరకకపోవడం ఆసక్తికరంగా మారింది. మరో పక్క ఆర్యన్ ఖాన్‌కు సంబంధించి షారుఖ్ మరియు అతని కుటుంబానికి మద్దతుగా అభిమానులు ఈ పోస్టర్‌లను వేశారు. ఇప్పుడు షారుఖ్ బృందం ఇంటి ముందు నుండి పోస్టర్లను తొలగించే పనిలో ఉంది.

  English summary
  Aryan Khan Bail Application Rejected By Court In Drugs Case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X