Aryan Khan bail plea షారుక్ కొడుకు కోసం ఇండియన్ టాప్ లాయర్.. ఒకవేళ బెయిల్ లభించకపోతే ఆర్యన్ పరిస్థితి ఇదే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. ముంబై గోవా క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ తన కుమారుడికి బెయిల్ ఇప్పించడానికి షారుక్ ఖాన్ కుటుంబం శత విధాల ప్రయత్నాలు చేస్తున్నది. అయితే దాదాపు 20 రోజులకు పైగా ఈ వ్యవహారం షారుక్ ఖాన్‌కు కొరకరాని కొయ్యగా మారుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న న్యాయవాదుల్లో ఒకరైన ముకుల్ రోహత్గ్నీ రంగంలోకి దిగారు. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ కేసులో బెయిల్ కోసం
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాలంటూ అత్యవసర పిటిషన్‌ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ పైకోట్రాపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్డీపీఎస్) యాక్ట్ ప్రత్యేక కోర్టును అక్టోబర్ 20వ తేదీన షారుక్ ఖాన్ కుటుంబం ఆశ్రయించింది. అయితే బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ అక్టోబర్ 30వ తేదీ వకు జుడిషియల్ కస్టడీకి ఆర్యన్‌ను పంపింది.

ఆర్యన్ అరెస్ట్ తర్వాత
అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత షారుక్ కుటుంబం తరుఫున సతీష్ మాన్‌షిండే, అమిత్ దేశాయ్ తమ వాదనలు వినిపించారు. అయితే ముంబై ఎన్టీపీఎస్ కోర్టును మెప్పించేలా చేసి ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇప్పించడంలో విఫలమయ్యారు. నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురికావడంతో ప్రస్తుతం ముంబై కోర్టును ఆశ్రయించారు.

బాంబే హైకోర్టును ఆశ్రయించిన షారుక్
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారం అంటే అక్టోబర్ 26 తేదీన బాంబే హైకోర్టులో విచారించనున్నారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ కోసం ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు విచారణలో ముకుల్‌కు ఆయన సీనియర్ అడ్వకేట్స్ రుబీ సింగ్ అహుజా, సందీప్ కపూర్ సహకరించనున్నారు.

ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో సమీర్ వాంఖడే
ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసును విచారిస్తూ బాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ ఎన్సీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సమీర్ వాంఖడే ఢిల్లీకి చేరుకొన్నారు. మంగళవారం ఎన్సీబీ డీజీని సమీర్ వాంఖడే కలుసుకోనున్నారు.
Recommended Video

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోతే
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ షారుక్ ఖాన్ కుటుంబానికి కీలకంగా మారింది. డ్రగ్స్ కేసులో ఒకవేళ బెయిల్ లభించకపోతే ఆర్యన్ ఖాన్ మరో 14 రోజులు ఆర్థర్ రోడ్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. ఎందుకంటే నవంబర్ 1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి.
నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. దాంతో ఎలాగైనా తన కుమారుడికి బెయిల్ ఇప్పించేలా దేశంలోనే పాపులారిటీ ఉన్న న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని రంగంలోకి దించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











