twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్యన్ ఖాన్ కి భారీ ఊరట.. ఎలాంటి ఆధారాల్లేవు... తేల్చేసిన బాంబే హైకోర్టు

    |

    క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 26 రోజుల పాటు కస్టడీలో ఉండగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్టోబర్ 28న బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, శనివారం, బాంబే హైకోర్టు నుండి ఆర్యన్‌కు బెయిల్ ఆర్డర్ వచ్చింది. ఈ కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    బెయిల్ ఆర్డర్‌ కాపీ

    బెయిల్ ఆర్డర్‌ కాపీ

    ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌కు సంబంధించిన వివరణాత్మక కాపీని బాంబే హైకోర్టు విడుదల చేసింది. ఇందులో ఆర్యన్‌ఖాన్‌ వద్ద ఎలాంటి వస్తువులు దొరకలేదని హైకోర్టు పేర్కొంది. అలాగే, ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాపై ఎలాంటి కుట్ర జరిగినట్లు ఆధారాలు లేవని ఆర్డర్ లో పేర్కొంది. ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2న అరెస్టు చేసింది. ముంబై నుంచి గోవాకు వెళ్తున్న క్రూజ్ డ్రగ్స్ పార్టీకి హాజరయ్యాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

    అన్ని వివరాలు

    అన్ని వివరాలు


    ఆర్యన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా సహా మరో 20 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీకి హాజరైన ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో మూడు వారాలు గడపాల్సి వచ్చింది. అక్టోబర్ 28న ఆర్యన్‌కు హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కేసుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి.

    కోర్టులో వాదించి

    కోర్టులో వాదించి

    హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఆర్యన్ ఖాన్ ఫోన్‌లో కనిపించిన వాట్సాప్ చాట్‌లో 'ముగ్గురు నిందితులు ఇతర సహ నిందితులతో కుట్ర' సంబంధాన్ని సూచించలేదు. ఆ ఆర్డర్ ప్రకారం నిందితుడి ఫోన్ వాట్సాప్ చాట్‌లో, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలు ఈ నేరానికి కుట్ర పన్నారని సూచించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అంతే కాదు ముగ్గురికి మెడికల్ చెకప్ కూడా చేయలేదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే సమయంలో తాము డ్రగ్స్ తీసుకున్నట్లు నిందితులు అంగీకరించారని ఎన్‌సీబీ కోర్టులో వాదించింది.

    చెప్పడం కష్టమే

    చెప్పడం కష్టమే

    ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, ఈ కేసులో ఎన్‌సీబీ తరఫు న్యాయవాది పత్రాలు సమర్పించారని హైకోర్టు ఉత్తర్వుల్లో రాసింది. అయితే బెయిల్ దరఖాస్తుదారు క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నారని, అతనిపై సెక్షన్ 29 విధించడం సాధ్యం కాదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. చివరగా, దరఖాస్తుదారులు ఎలాంటి డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయో చెప్పడం కష్టమని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

    Recommended Video

    Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
     చెల్లుబాటు కావు

    చెల్లుబాటు కావు

    NDPS చట్టంలోని సెక్షన్ 37 కింద నిర్దేశించిన పారామీటర్‌లు దరఖాస్తుదారులకు బెయిల్ మంజూరు కోసం చేసే దరఖాస్తులపై ఎటువంటి ప్రభావం చూపవని పేర్కొంది. నిందితులు ముగ్గురూ ఒకే క్రూయిజ్ నౌకలో ఉండడం ఒక్కటే వారు తప్పు చేశారనడానికి ఆధారం కాబోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి నిందితుల నుంచి తీసుకున్న నేరాంగీకార వాంగ్మూలాలు మీద ఎన్సీబీ ఆధారపడరాదని, అవి చెల్లుబాటు కావని పేర్కొంది. ఖచ్చితంగా ఆధారాలు ఉండాల్సిందేనాని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

    English summary
    Aryan Khan Bail Order Says No Proof Of Conspiracy in drugs case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X