twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan Bail Hearing: షారుక్ ఖాన్ కోసం రంగంలోకి ముకుల్ రోహత్గీ.. ఫీజు ఎంత తీసుకొంటున్నారో తెలుసా?

    |

    డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైన అంశంగా మీడియాలో మారింది. గత 25 రోజులుగా తిరస్కారానికి గురవుతున్న బెయిల్ పిటిషన్‌పై మరోసారి విచారణ మొదలైంది. ఈసారైనా షారుక్ ఖాన్ కొడుకుకు బెయిల్ లభిస్తుందా అనే ప్రశ్న అందర్నీ వెంటాడుతున్నది. ఇటీవల ముంబై స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో షారుక్ ఖాన్ కుటుంబం పిటిషన్ బాంబే హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే...

    పలుమార్లు కోర్టులో షారుక్‌కు చుక్కెదురు

    పలుమార్లు కోర్టులో షారుక్‌కు చుక్కెదురు

    అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ గురించి ప్రముఖ లాయర్లు అమిత్ దేశాయ్, సతీష్ మాన్‌షిండే లాంటి వాళ్లు తమ వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తులను వారి వాదనలు మెప్పించలేపోకపోవడంతో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

    రంగంలోకి ముకుల్ రోహత్గీ

    రంగంలోకి ముకుల్ రోహత్గీ

    ఇక ఆర్యన్ ఖాన్‌కు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తూ కేసును వాదించే బాధ్యతను దేశంలోనే ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీకి అప్పగించారు. గతంలో రోహత్గీ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. విపత్కర, దయనీయమైన పరిస్థితుల మధ్య షారుక్ అభ్యర్థన మేరకు ఈ కేసును ముకుల్ రోహత్గీ టేకప్ చేశారు.

    ఎవరీ ముకుల్ రోహత్గీ

    ఎవరీ ముకుల్ రోహత్గీ

    ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన కెరీర్‌లో వాదించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఆ తర్వాత జస్టిస్ బీహెచ్ లోయ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ తన వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో వాదించడానికి ఆయన భారీగా అంటే.. 1.2 కోట్ల ఫీజును తీసుకొన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత 1999లో ఆయన అడిషినల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు.

    ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఫీజు ఎంతంటే?

    ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఫీజు ఎంతంటే?

    బాలీవుడ్‌ను కుదిపేసని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొన్న ముంబై కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో మసకబారిన మహారాష్ట్ర పోలీసుల ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వాదనలు వినిపించడానికి రోహత్గీకి రూ.25 కోట్ల ఫీజును ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సిద్దమయ్యారనే విషయంపై మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

    Recommended Video

    Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
    బాంబే హైకోర్టులో విచారణ ప్రారంభం

    బాంబే హైకోర్టులో విచారణ ప్రారంభం

    ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ అక్టోబర్ 27వ తేదీన విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ బాంబే హైకోర్టులో మళ్లీ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు. అతడు వాటిని ఉపయోగించినట్టు ఆధారాలు లేవు. ఈ కేసులో ఆధారాలు మార్చివేస్తారనే భయం లేదు కాబట్టి కేసు విచారణకు ఎలాంటి అడ్డంకి కానందున ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాలని రోహత్గీ న్యాయమూర్తిని కోరినట్టు సమాచారం.

    English summary
    Shah Rukh Khan's son Aryan Khan Whatapp conversations with three other star kids apart from Ananya Panday. Aryan bail petition hearing stopped due to the commotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X