Aryan Khan బెయిల్ నిరాకరణ.. షారుక్‌కు మళ్లీ నిరాశే.. సల్మాన్ ఖాన్ ప్రార్థనలు

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ఎడతెగని టెలి సీరియల్‌లా వాయిదాలు పడుతున్నది. ముంబై, గోవా క్రూయిజ్‌లో అక్టోబర్ 2వ తేదీన జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్, మున్ మున్ దమేచా, అర్బాజ్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ గురువారానికి (అక్టోబర్ 28వ తేదీకి) వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారించనున్నట్టు కోర్టు వెల్లడించింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ముఖ్య అంశాలు ఇవే.. .

 అరెస్ట్ మెమోను పరిశీలించండి

అరెస్ట్ మెమోను పరిశీలించండి

ఆర్యన్ ఖాన్‌ తరుఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. క్రూయిజ్‌లో దాడి చేసిన సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లభ్యం కాలేదు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకొన్నట్టు కూడా స్పష్టత లేదు. కాబట్టి ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. అంతేకాకుండా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ మెమోను పరిశీలించండి. అందులో ఎలాంటి నేరారోపణలు లేవు అని కోర్టుకు తెలిపారు.

 మున్ మున్ బలి పశువు

మున్ మున్ బలి పశువు

ముంబైలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె మున్ మున్ దమేచా తరఫున న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదనలు వినిపించారు. ఎన్సీబీ సోదాలు జరిపిన సమయంలో మున్ మున్ వద్ద డ్రగ్స్ లభించలేదు. కొన్ని కేసులను కాపీ చేసి తన క్లయింట్‌పై పెట్టారు. ఈ కేసులో మున్ మున్ బలిపశువును చేశారు. సౌమ్య, బల్దేవ్ రూమ్స్‌లో డ్రగ్స్ లభ్యమయ్యాయనే విషయాన్ని ఆయన కోర్టుకు విన్నవించారు.

వాట్సాప్ ఛాట్‌కు సంబంధం లేదు

వాట్సాప్ ఛాట్‌కు సంబంధం లేదు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వాట్సప్ ఛాటింగ్‌ను ప్రధానంగా ఎన్సీపీ హైలెట్ చేస్తున్నది. కానీ ఆ వాట్సప్ చాట్స్ ముంబై క్రూయిజ్‌కు సంబంధించిన ఛాటింగ్ కావు. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. వాటి ద్వారా మీడియా విచారణ చేస్తున్నది. కాబట్టి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు కోరారు.

రక్త పరీక్షలు ఎందుకు చేయించలేదు

రక్త పరీక్షలు ఎందుకు చేయించలేదు

అర్యన్ ఖాన్, మున్ మున్ దమేచా, అర్బాజ్ మర్చంట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టార్గెట్ చేసింది. వారిపై ఉద్దేశపూర్వకంగా వారిపై కేసులు నమోదు చేసింది. అరెస్ట్ సమయంలో వారికి రక్త పరీక్షలు నిర్వహించలేదు. వారు డ్రగ్స్ తీసుకొన్నారా? లేదా అనే విషయం రక్త పరీక్షల్లో బయటపడుతుంది కదా.. కానీ ఎన్సీబీ అధికారులు అలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఈ కేసు కేవలం కుట్ర పూరితమైనది అంటూ అర్బాజ్ మర్చంట్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
సల్మాన్ ఖాన్ దేవుడికి ప్రార్థనలు

సల్మాన్ ఖాన్ దేవుడికి ప్రార్థనలు

ఇక ఇదిలా ఉండగా, అర్యన్ ఖాన్ అరెస్ట్ జరిగినప్పటి నుంచి షారుక్ ఖాన్‌కు మానసిక ధైర్యాన్ని ఇస్తూ.. అండగా సల్మాన్ ఖాన్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం కోర్టులో బెయిల్ పిటిషన్‌‌పై విచారణ జరుగుతున్న సమయంలో దేవుడిని స్మరించుకొంటూ సల్మాన్ ప్రార్థనలు చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించాలని కోరుకొన్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణ గురువారం మళ్లీ జరుగనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X