twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan బెయిల్ తిరస్కరణ.. వెలుగులోకి బిట్ కాయిన్ కుంభకోణం, డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే సంచలన విషయాలు

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. ఇటీవల కాలంలో ఓ సూపర్‌స్టార్ కుమారుడు ఇలాంటి కేసుల్లో బుక్ కావడం ఇదే ప్రథమం. గత కొద్దికాలంగా డ్రగ్స్ కేసుల్లో చిన్నచితకా నటులు పట్టుడుతున్నా.. ఇలా అగ్రశ్రేణి హీరో కుటుంబ సభ్యుడు అరెస్ట్ కావడం భారీ చర్చకు దారి తీసింది. బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాలను మరోసారి బయటపెట్టింది. అయితే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించకుండా చేయడంలో ఎన్సీబీ అధికారులు వినిపించిన వాదనలు బలంగా పనిచేశాయనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆర్యన్ అరెస్ట్ వెనుక ఎన్సీబీ చెపిన కారణాలు ఏమిటంటే..

    ఇంటర్నేషనల్ రాకెట్ హస్తం

    ఇంటర్నేషనల్ రాకెట్ హస్తం


    డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అడిషినల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్‌లో అనేక వివాదాస్పద అంశాలు కనిపించాయి. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ రాకెట్ హస్తం ఉందనే విషయం వాట్సప్ చాట్‌లో స్పష్టమైందని కోర్టుకు ఎన్సీబీ వెల్లడించినట్టు సమాచారం.

    ఐదుగురి విచారణ పూర్తి కాలేద అంటూ

    ఐదుగురి విచారణ పూర్తి కాలేద అంటూ

    ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం. మరో ఐదుగురిని విచారిస్తున్నాం. వారి విచారణ పూర్తి అయ్యేంత వరకు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీలో ఉండాల్సి ఉంటుంది. త్వరలోనే ఐదుగురిని కోర్టులో ప్రవేశపెడుతాం. షిప్‌లో జరిగిన పార్టీకి మొత్తం ఎనిమిది మంది సభ్యులకు సంబంధం ఉంది. కాబట్టి ఆర్యన్ ఖాన్‌కు కూడా ఈ వ్యవహారంలో భాగముందని ఎన్సీబీ విశ్వసిస్తున్నది. అందుకే మా కస్టడీని కోరుతున్నాం అని అనిల్ సింగ్ తెలిపినట్టు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.

    డ్రగ్స్ సప్లయర్ తొమ్మిదో వ్యక్తిగా

    డ్రగ్స్ సప్లయర్ తొమ్మిదో వ్యక్తిగా

    ఆర్యన్ ఖాన్ పాల్గొన్న పార్టీలో తొమ్మిదో వ్యక్తి కీలకంగా వ్యహరించాడు. అతడు ముంబైలోని జుహు ప్రాంతంలోని ఓ సప్లయిర్. అతడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నాం. అతడిని విచారిస్తూ అనేక విషయాలు రాబడుతున్నాం. ఈ పార్టీ వెనుక ఇంకా ఎవరి హస్తముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. కోర్టులో విచారణ సందర్భంగా రియా చక్రవర్తి బెయిల్ ప్రస్తావనను కూడా తెచ్చారు. ఈ కేసులో రియాను కస్టడీలో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు.

    నా స్నేహితుడి వద్ద డ్రగ్స్ అంటూ

    నా స్నేహితుడి వద్ద డ్రగ్స్ అంటూ

    కోర్టులో ఆర్యన్ ఖాన్ తన గురించి చెప్పుకొంటూ.. నా స్నేహితుడు కోరిక మేరకు నేను అక్కడికి వెళ్లాను. క్రూయిజ్‌లో నాకు బెస్ట్ సూట్ ఏర్పాటు చేశారు. అయితే పార్టీకి హాజరయ్యాను. కానీ నేను దాని కోసం ఎలాంటి చెల్లింపులు జరపలేదు. అధికారులు నా బ్యాగ్‌ను సోదా చేశారు. కానీ వారికి ఏమీ లభించలేదు. ఆ తర్వాత నా ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం నిన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా స్నేహితుడు మర్చంట్ వద్ద డ్రగ్స్ లభించాయి. దాంతో మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఆర్యన్ ఖాన్ చెప్పినట్టు తెలిసింది.

    వాట్సాప్ ఛాట్ చేయడం నేరం కాదు

    వాట్సాప్ ఛాట్ చేయడం నేరం కాదు

    అయితే ఆర్యన్ ఖాన్ తరఫున ప్రముఖ లాయర్ మాన్‌షిండే వాదనలు వినిపించారు. ఒకరి వద్ద డ్రగ్స్ లభిస్తే.. మరొకరిని కేసులో ఇరికించడం సబబు కాదు. అలాగే వాట్సాప్ ఛాట్‌ను ఆధారంగా నేరం చేశారనే అభియోగాలు మోపడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఫోన్‌లో డ్రగ్స్ వ్యవహారాలను మాట్లాడితే అది నేరం కిందకు రాదు అని మాన్‌షిండే స్పష్టం చేశారు.

    ఆర్యన్ కస్డడీపై సమీర్ వాంఖడే క్లారిటీ

    ఆర్యన్ కస్డడీపై సమీర్ వాంఖడే క్లారిటీ

    కోర్టులో వాదనలను పక్కన పడితే ముంబై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ అరెస్ట్, కస్డడీపై క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సింది చాలా ఉంది. వీరి అరెస్ట్ తర్వాత మరికొంత మందిని అరెస్ట్ చేశాం. పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసే సప్లయర్‌ను అరెస్ట్ చేశాం. విచారణ జరుగుతున్నది అని సమీర్ వాంఖడే మీడియాకు చెప్పారు.

    Recommended Video

    KondaPolam : Panja Vaishnav Tej's Kondapolam Audio Release Event
    బిట్ కాయిన్ కుంభకోణం, ఇతర సంచలనాలు

    బిట్ కాయిన్ కుంభకోణం, ఇతర సంచలనాలు

    ఆర్యన్ ఖాన్, ఇతరులను అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత డ్రగ్స్ రాకెట్ గురించి కొత్తకోణాలు బయటపడ్డాయి. బిట్ కాయిన్ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కోసం బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులు జరిపిన విషయం మా దృష్టికి వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నాం. ఈ కేసులో ఇంకా చాలా సంచలన విషయాలు బయటకు రావాల్సి ఉంది. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది అని సమీర్ వాంఖడే తెలిపారు.

    ఆర్యన్‌ ఖాన్‌పై నమోదైన కేసులు ఇవే

    ఆర్యన్‌ ఖాన్‌పై నమోదైన కేసులు ఇవే

    సమీర్ వాంఖండే నేతృత్వంలో ముంబై ఎన్సీబీ జరిపిన దాడిలో ఆర్యన్ ఖాన్ స్నేహితుడు, నటుడు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇష్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్, గోమిత్ చోప్రాం, విక్రాంత్ చోకర్ ఉన్నారు. మున్ మున్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనే విషయం బయటకు వచ్చింది. ముంబైలోని ప్రముఖుల వారసులపై ఎన్సీబీ పక్కాగా వలపన్నీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆర్యన్ ఖాన్, మరో ఏడుగురిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 8సీ, 20, 27, 35 సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని ఎన్సీబీ వివరించింది.

    English summary
    Narcotics Control Bureau investigating Sushant Singh Rajput to Aryan Khan cases: NCB Zonal officer Sameer Wankhede playing crucial role. NCB's argued 10 reasons for Custody
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X