Don't Miss!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Aryan Khan bail rejected: షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయాలు.. విషాద సమయంలో..
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత షారుక్ ఖాన్‌తోపాటు ఆయన సన్నిహితులు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బాలీవుడ్ ప్రముఖులంతా షారుక్ ఖాన్‌కు కటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నారు. పలువురు షారుక్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఐదుసార్లు బెయిల్ నిరాకరించడంతో సల్మాన్, షారుక్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా అక్టోబర్ 20వ తేదీన బెయిల్ నిరాకరణ తర్వాత ఆ సంచలన నిర్ణయాలు ఏమిటంటే..
అట్లీ సినిమా షూట్లో షారుక్
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సమయంలో షారుక్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో లయన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగులో ఉండగానే ఆర్యన్ అరెస్ట్ వార్త తెలిసింది. వెంటనే లయన్ (తాత్కాలిక టైటిల్) సినిమా షూటింగును వాయిదా వేసి కొడుకును జైలు నుంచి విడిపించుకొనే ప్రయత్నంలో పడ్డారు. గత కొద్ది కాలంగా ఏ షూటింగుకు హాజరుకాకుండా బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు.
పఠాన్ మూవీ కోసం షారుక్ స్పెయిన్‌కు
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ జరగకపోతే వాస్తవానికి షారుక్ ఖాన్ స్పెయిన్‌లో జరిగే పఠాన్ సినిమా షూటింగులో పాల్గొనాల్సి ఉంది. అప్పటికే దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తన టీమ్‌తో స్పెయిన్‌కు వెళ్లిపోయారు. అక్కడ దీపిక పదుకోన్, షారుక్ ఖాన్‌పై రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఆర్యన్ కేసు నేపథ్యంలో పఠాన్ యూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక అట్లీ మాత్రం షారుక్ ఖాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన డూప్ ప్రశాంత్ వాల్దేను ఉపయోగించుకొని సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సంఘీభావంతో
ఇక ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వార్తతో సల్మాన్ ఖాన్ కూడా దిగ్బ్రాంతికి గురయ్యాడు. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించే టైగర్ 3 షూటింగును అర్ధాంతరంగా వాయిదా వేసుకొన్నారు. తన స్నేహితుడు షారుక్ ఖాన్‌ను కష్టాల్లో పడటంతో అండగా నిలుస్తున్నారు. తనకు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసులో వాదనలు వినిపించిన లాయర్ అమిత్ దేశాయ్‌ని రంగంలోకి దించారు.
సల్మాన్ అన్ని షూటింగ్ రద్దు
ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి షారుక్ ఖాన్‌కు సహాయం అందిస్తున్న సల్మాన్ ఖాన్ తన కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు. వారాంతంలో బిగ్‌బాస్ షోకు సంబంధించిన షూట్లో మాత్రమే పాల్గొన్నారు. టైగర్ చిత్రంలోని యాక్షన్ సీన్ల కోసం ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్‌తో చేయాల్సిన రిహార్సల్స్‌ను రద్దు చేసుకొన్నారు. టైగర్ షూటింగ్ కోసం యష్ రాజ్ స్టూడియోలో రెండు సెట్లను, గురుగ్రామ్‌లో మరో సెట్ వేశారు. పాకిస్థాన్ నేపథ్యంగా సాగే సన్నివేశాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి సెట్స్‌ను వేశారు.
Recommended Video
15 రోజులుగా షూటింగులు క్యాన్సిల్
ఇదిలా ఉండగా, తన కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న షారుక్ ఖాన్ తన రెండు సినిమా షూటింగులను నిరవధికంగా వాయిదా వేశారు. పఠాన్, లయన్ సినిమా షూటింగులకు గత పదిహేను రోజులుగా హాజరుకావడం లేదు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3 సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. ఇలా ఇద్దరు సూపర్ స్టార్లు తమ సినిమా షూటింగులను వాయిదా వేసుకోవడం సంచలనంగా మారింది.