twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan Case: మరో సారి షాక్.. ఆ తేదీకి రిజర్వ్.. మరో ఆరు రోజుల పాటు అదే జైల్లో?

    |

    ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. ఆసక్తికరంగా మారుతోంది. ప్రముఖ నటుడు షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు గురువారం బెయిల్ లభిస్తుందని అందరూ ఊహించగా షారుఖ్, ఆర్యన్ సహా అందరికి షాక్ ఇస్తూ ముంబై కోర్టు బెయిల్ ఇవ్వలేమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. దీంతో ఆర్యన్‌ ఖాన్‌ 20 వరకు జైల్లో ఉండనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే

    ఆర్యన్ ఖాన్‌ను ఎలా అరెస్టు చేశారు?

    ఆర్యన్ ఖాన్‌ను ఎలా అరెస్టు చేశారు?

    ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 2 న ఎన్‌సిబి అరెస్టు చేసింది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీకి ఆర్యన్ ఖాన్ హాజరు అయ్యాడు. ఈ క్రూయిజ్ షిప్‌లో, NCB ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాతో సహా 8 మందిని అరెస్టు చేసింది. అయితే, ఆర్యన్ నుంచి ఎలాంటి డ్రగ్స్ కనుగొనబడలేదు. బిజెపితో సంబంధం ఉన్న నాయకులు క్రూయిజ్‌లో జరిగే డ్రగ్స్ పార్టీ గురించి ఎన్‌సిబికి తెలియజేశారని ఆ తర్వాత ఎన్‌సిబి చర్య తీసుకుందని అంటున్నారు.

    అక్టోబర్ 20న

    అక్టోబర్ 20న

    ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మీద తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ బెయిల్ పిటిషన్ మీద కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కోర్టు ఆర్యన్ బెయిల్ విచారణ జరగగా ఈ కేసులో తీర్పు అక్టోబర్ 20 న ప్రకటించబడుతుందని వెల్లడించింది. అంటే, ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌తో సహా ఇతర నిందితులు 6 రోజులు జైలులో ఉండాల్సి ఉంటుంది.

    వాడివేడి వాదనలు

    వాడివేడి వాదనలు

    ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు గురువారం కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎన్సీబీ తరపు న్యాయవాది మరోసారి వ్యతిరేకించారు. ఎన్‌సీబీ లాయర్ ఆర్యన్‌ డ్రగ్స్‌కు బానిస అని , క్రూయిజ్‌లో దొరికిన డ్రగ్స్‌ ఆర్యన్‌ కోసమే తీసుకొచ్చారని తెలిపారు. దీనిపై కోర్టులో సాక్ష్యం కూడా ఇచ్చినట్లు తెలిపింది. ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ పెడ్లర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని , విదేశాల నుంచి భారీగా డ్రగ్స్‌ తెప్పించేందుకు ఆర్యన్‌ ప్రయత్నిస్తున్నడని కూడా ఎన్సీబీ సంచలన ఆరోపణలు చేసింది.

    ఆర్యన్ ఖాన్ న్యాయవాది కోర్టులో ఏమన్నారంటే?

    ఆర్యన్ ఖాన్ న్యాయవాది కోర్టులో ఏమన్నారంటే?

    ఆర్యన్ ఖాన్ తరఫు ప్రముఖ లాయర్ అమిత్ దేశాయ్ మాట్లాడుతూ, నేటి తరం పిల్లల భాష, ఇంగ్లీషు భాష మనకు చాలా భిన్నమైనవిగా అనిపించవచ్చని పేర్కొన్నారు. వారి సంభాషణలు ఏజెన్సీకి అనుమానాస్పదంగా అనిపించవచ్చని ఆయన అన్నారు. ఈ బాలుడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణాలో పాల్గొంటాడని మీరు అనుకుంటున్నారా? మీరు దర్యాప్తు చేయండి, కానీ ఈ ఆరోపణలు పూర్తిగా తప్పు మరియు నిరాధారమైనవని అన్నారు.

    Recommended Video

    Supyaardee Singh & Aryan Krishna Interview Part 3 | Cheppina Evaru Nammaru
    మళ్ళీ జైలుకు

    మళ్ళీ జైలుకు

    అమిత్ దేశాయ్.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ తన క్లయింట్ కు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎన్సీబీ కాలరాస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ లభించని నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ ను పోలీసులు తిరిగి ముంబై ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు.

    English summary
    Mumbai Special NDPS court reserves order for 20th October on aryan khan bail. ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X