Aryan Khan gets bail: బాంబే హైకోర్టు విధించిన షరతులు ఇవే.. అసలు సినిమా ముందు ఉందంటూ..
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపడం సత్పాలితాలను ఇచ్చింది. ఎన్సీబీ, రోహత్గీ వాదనలు విన్న తర్వాత బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఆర్యన్ ఖాన్‌కు మంజూరు చేసింది. దీంతో షారుక్ కుటుంబంలో ఆనందం మిన్నంటింది. ఆయన సన్నిహితులు, స్నేహితుల్లో సంతోషం కనిపించింది. సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ బెయిల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించిన వెంటనే అభిమానులు షారుక్ ఖాన్ నివాసం ముందు భారీగా బాణాసంచాను కాల్చి ఆనందాన్ని పంచుకొన్నారు.

అయితే అక్టోబర్ 3వ తేదీ నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ రేపు గానీ.. శనివారం గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్యన్ ఖాన్‌తోపాటు అర్బాజ్ మర్చంట్, మునుమున్ దమేచాకు బెయిల్ మంజూరు చేస్తూ.. కొన్ని షరతులు విధించింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన తీర్పును రేపు ప్రకటించనున్నారు.
బాంబే హైకోర్టు విధించిన షరుతులు ఇవే..
ఎన్సీబీ స్పెషల్ కోర్టులో ఆర్యన్ ఖాన్ తన పాస్‌పోర్టును అప్పగించాలి
ప్రతీ శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్‌లో 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరుకావాలి.
తన సహ నిందితులతో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ కమ్యూనికేషన్ కొనసాగించరాదు.
ఆర్యన్ ఖాన్ వ్యక్తిగతంగానీ మరో వ్యక్తితో గానీ.. సాక్ష్యులను ప్రభావితం చేయడం, లేదా సాక్ష్యాలను రూపుమాపకుండా ఉండాలి.
స్పెషల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నందున మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఆర్యన్ ఖాన్ చేయకూడదు.
ఇక ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించిన వెంటనే షారుక్ ఖాన్ లీగల్ టీమ్‌తో కలిసి ఆనంద క్షణాలను పంచుకొన్నారు. షారుక్ ఖాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నది.
ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించిన తర్వాత ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఘాటుగా స్పందించారు. ఇంకా ఈ కేసులో సినిమా ఆరంభ కాలేదు. అసలు సినిమా ముందుంది. సమీర్ వాంఖడే అవినీతి విషయాన్ని బయటపెడుతాం అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











