Don't Miss!
- Technology Whatsapp Filters వాట్సాప్‌లో ఫిల్టర్స్ పేరుతో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!
- Sports IPL 2024: హార్దిక్ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- News టీడీపీ కోసం రంగంలోకి ముగ్గురు వ్యూహకర్తలు - గేమ్ ఛేంజ్..!!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు.. షారుక్ ఫ్యామిలీకి భారీ ఊరట.. గ్రాండ్‌గా దీపావళీ, బాద్షా బర్త్ డే వేడుకలు
ముంబై, గోవా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుటంబానికి ఊరట లభించింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ దమేచాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను, కారణాలను శుక్రవారం వెల్లడిస్తానని కోర్టు చెప్పింది. ఈ ఆర్యన్ బెయిల్ మంజూరుకు సంబంధించిన పూర్తి కథనం కొద్ది సేపట్లలో వివరంగా..
శుక్రవారం గానీ, శనివారం గానీ..
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో తీవ్ర వాదనలు చోటు చేసుకొన్నాయి. ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ తన వాదనలు వినించారు. ఎన్సీబీ తరుఫున అనిల్ సింగ్ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. కోర్టు ఆదేశాలతో ఆర్యన్ ఖాన్ శుక్రవారం గానీ, లేదా శనివారం గానీ విడుదలయ్యే అవకాశం ఉంది అని లాయర్ అమిత్ దేశాయ్ వెల్లడించారు.
డీలర్ వద్ద 200 గ్రాముల డ్రగ్స్
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాలంటూ షారుక్ కుటుంబం తరుఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌కు షిప్లో ఎవరు తెలియదు. అర్బాజ్ మర్చంట్, అచిత్ మాత్రమే తెలుపు. డ్రగ్ డీలర్‌గా అచిత్ నాలుగు రోజుల క్రితమే అరెస్ట్ అయ్యాడు. అతడి వద్ద 2.4 గ్రాముల డ్రగ్స్ లభించాయి. ఒక డీలర్ కనీసం 200 గ్రాముల డ్రగ్స్ ఉంచుకోవడానికి అనుమతి ఉంది అని రోహత్గీ పేర్కొన్నారు.
చట్ట ప్రకారమే ఆర్యన్ అరెస్ట్
ఆర్యన్ ఖాన్ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్యలపై అనిల్ సింగ్ స్పందిస్తూ.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చట్టబద్దంగా జరిగింది. కుట్రలు చేస్తే రుజువు చేయడం చాలా కష్టం. కుట్రదారులకే తెలుసు కుట్రలు ఎలా చేయడం. విచక్షణ అనే అంశాన్ని కోర్టుకే వదలివేస్తాం అని అన్నారు. డ్రగ్స్ కేసులో వేచి చూసే ధోరణి గానీ, విడిచిపెట్టే ధోరణి ఉండకూడదు అని కోర్టుకు విన్నవించారు.
Recommended Video
మన్నత్‌లో దీపావళీ, షారుక్ వేడుకలకు ఏర్పాట్లు
ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించడంపై షారుక్ ఖాన్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తున్నది. షారుక్ ఇంటిలో ఘనంగా జరిగే దీపావళీ పండుగ, అలాగే నవంబర్ 2వ తేదీన షారుక్ ఖాన్ పుట్టిన రోజుకు ముందు ఆర్యన్ విడుదల కావడంతో మన్నత్‌లో పండుగ వాతావరణం నెలకొన్నట్టు సమాచారం. ఆర్యన్ విడుదల కాకపోతే మన్నత్‌లో దీపావళీ, షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల తర్వాత ఆర్యన్‌కు బెయిల్ లభించడంతో మన్నత్‌లో నిజమైన దీపావళీ నెలకొనే అవకాశం ఉంది.