Aryan Khan ఖైదీ నంబర్ 959.. సూపర్ స్టార్ కుమారుడికి 4500 మనీ ఆర్డర్.. డబ్బు ఎవరు పంపారో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టై ఇప్పటికి సుమారు 15 రోజులు కావొస్తున్నది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ముంబై కోర్టు తిరస్కరించింది. ఆర్యన్ ఖాన్‌కు విదేశాల్లోని డ్రగ్స్ రాకెట్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. డ్రగ్స్ సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అని ఎన్సీబీ అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ జైలులో గడుపుతున్న జీవితం, అతడికి సంబంధించిన విషయాలు షాకింగ్‌గా మారాయి. ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల్లోకి వెళితే..

ఆర్యన్‌కు 4 సార్లు బెయిల్ తిరస్కరణ

ఆర్యన్‌కు 4 సార్లు బెయిల్ తిరస్కరణ

అక్టోబర్ 2వ తేదీన ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారులు పట్టుబడటం, వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. నాలుగు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడి పిటిషన్‌ తిరస్కారానికి గురైంది. ఈ నెల 20వ వరకు ఆర్యన్ ఖాన్‌ జుడిషియల్ కస్టడీలో ఉంచారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలను 20వ తేదీన కోర్టు వినే అవకాశం ఉంది.

ఫ్యామిలీతో 10 నిమిషాలు వీడియో కాల్

ఫ్యామిలీతో 10 నిమిషాలు వీడియో కాల్

కోవిడ్ 19 వైరస్ కారణంగా అండర్ ట్రయల్ ఖైదీలకు జైలు అధికారులు ఇచ్చిన సౌలభ్యంతో ఆర్యన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. వారంలో ఖైదీలు రెండుసార్లు మాట్లాడుకోవచ్చనే నిబంధన ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆర్యన్ ఖాన్‌కు ఈ అవకాశం లభించింది. సుమారు 10 నిమిషాలపాటు ఆర్యన్ ఖాన్ తన కుటుంబంతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు.

ఇంటి నుంచి 4500 మనీ ఆర్డర్

ఇంటి నుంచి 4500 మనీ ఆర్డర్

స్టార్ హీరో కుమారుడు కావడం వల్ల ఆర్యన్ ఖాన్‌కు జైలులో అతడి ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అందిస్తున్నారనే ఊహాగానాలను, రూమర్లను జైలు అధికారులు ఖండించారు. ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఖాన్ ఆహారం కొనుగోలు చేయడానికి షారుక్ కుటుంబం అతడికి రూ.4500 మనీ ఆర్డర్ చేసినట్టు అధికారులు ధృవీకరించారు. జైలులో తయారు చేసే ఆహారాన్ని ఖైదీలు కొనుగోలు చేసే వెసలుబాటు ఉండటంతో మంచి ఆహారం కోసం ఆర్యన్‌కు డబ్బులు మనీ ఆర్డర్ చేశారని వెల్లడించారు.

 ఖైదీ నంబర్ N956

ఖైదీ నంబర్ N956

ముంబైలోని ప్రతిష్టాత్మకమైన ఆర్థర్‌ రోడ్ జైలులో ఆర్యన్ ఖాన్‌ను అండర్ ట్రయల్ ఖైదీగా అధికారులు పరిగణిస్తున్నారు. ఇటీవల ఆర్యన్ ఖాన్‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రావడంతో కామన్ సెల్ నుంచి బారికెడ్‌లోకి తరలించారు. అతడికి అండర్ ట్రయల్ ఖైదీ N956 అనే నంబర్‌ను ఇచ్చారు.

Recommended Video

Supyaardee Singh & Aryan Krishna Interview Part 3 | Cheppina Evaru Nammaru
మరిన్ని రైడ్స్, ఆరెస్టులు

మరిన్ని రైడ్స్, ఆరెస్టులు

ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్ వాట్సప్ ఛాట్స్, ఇతరులు అందించిన సమాచారం ఆధారంగా గత రెండు రోజులుగా ఎన్సీబీ అధికారులు మెరుపుదాడుల చేశారు. సోమవారం అంటే అక్టోబర్ 18వ తేదీన మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత 25కి పైగా అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X