twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్యన్ ఖాన్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేద్దామనుకున్నారు.. కొత్త సంచలనం తెర మీదకు?

    |

    డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( ఎన్‌సీబీ ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై నిరంతరం సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు . ఆర్యన్ ఖాన్‌ను 'కిడ్నాప్' చేసి షారుఖ్ ఖాన్ నుండి 'డబ్బు' వసూలు చేసే ప్లాన్‌లో సమీర్ వాంఖడే భాగమని ఇప్పుడు మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

     అంతా ప్లాన్ ప్రకారమే

    అంతా ప్లాన్ ప్రకారమే

    మీడియాతో మాట్లాడిన మాలిక్, బీజేపీ నాయకుడు మోహిత్ భారతీయే ఈ పథకం సూత్రధారి అని పేర్కొన్నారు. మోహిత్ మరియు సమీర్ ఓషివారా ప్రాంతంలో స్మశాన వాటికలో కలుసుకున్నారని మాలిక్ పేర్కొన్నాడు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పని చేయకపోవడం వాంఖడే అదృష్టమని మాలిక్ అన్నారు. ఈ భయంతోనే సమీర్ వాంఖడే తనను ఎవరో ఫాలో అవుతున్నారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కూడా చేశాడని అన్నారు.

     కిడ్నాప్ చేయడానికి

    కిడ్నాప్ చేయడానికి

    మాలిక్ మాట్లాడుతూ వాదనలో, 'క్రూయిజ్ షిప్‌లో ఆరోపించిన డ్రగ్స్ పార్టీ డబ్బు కోసం ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేయబడింది, ఈ ప్లాన్ సూత్రధారి మోహిత్ భారతీ నే అని ఆయన అన్నారు. తన బావ రిషబ్ సచ్‌దేవా ద్వారా ఆర్యన్‌ను కిడ్నాప్ చేసేందుకు భారతీ పథకం పన్నాడని మాలిక్ ఆరోపించారు. మాలిక్ ముందుకు వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని షారుఖ్‌ను కూడా అభ్యర్థించాడు.

    18 కోట్ల డీల్

    18 కోట్ల డీల్

    మాలిక్ ఇంకా మాట్లాడుతూ, '25 కోట్ల డబ్బు డిమాండ్ చేయబడింది, అయితే ఒప్పందం రూ. 18 కోట్లకు జరిగింది. ఇందులో 50 లక్షలు కూడా ఇచ్చారు. కానీ ఆర్యన్‌తో కెపి గోసావి సెల్ఫీ కారణంగా డీల్ చెడిపోయిందని అన్నారు. అసలు క్రూయిజ్ పార్టీకి ఆర్యన్ ఖాన్‌ టికెట్ కొనలేదని, ఆయనని ప్రతీక్ గబా, అమీర్ ఫర్నీచర్‌వాలా తీసుకెళ్లారని, అయితే ఎన్‌సిబి తర్వాత వారిద్దరితో పాటు సచ్‌దేవాను తొలగించిందని మాలిక్ ఆరోపించారు.

    కొత్త ఆరోపణలు

    కొత్త ఆరోపణలు

    ఇక 'ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు' అనే నవాబ్ మాలిక్ ఆరోపణకు మరింత బలం చేకూరుతున్నట్లు కనిపిస్తోంది ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ నుండి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించిన కేసులో సాక్షి అయిన విజయ్ పగారే, ఈ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ప్రమేయం లేదని శనివారం పేర్కొన్నారు.

     డబ్బు కోసమే అలా ప్లాన్ చేశారు!

    డబ్బు కోసమే అలా ప్లాన్ చేశారు!

    ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న విజయ్ పగారే నవంబర్ 4న ముంబై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్‌పై దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని, డబ్బు సంపాదించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కొంతమంది ఇరికించారని విజయ్ పగారే ప్రకటనలో పేర్కొన్నారు. సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్‌ని బలవంతంగా కిడ్నాప్ చేశాడని నవాబ్ మాలిక్ కూడా ఆరోపించారు.

    Recommended Video

    Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
    అంతకు ముందు కూడా అలాగే

    అంతకు ముందు కూడా అలాగే

    సాక్షి విజయ్ పగారే, ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌తో సంభాషణలో, దాడి ముందస్తు ప్రణాళిక అని ఆరోపించారు. అంతకు ముందు, ఈ కేసులో మరో స్వతంత్ర సాక్షి ప్రభాకర్ సెయిల్, ఆర్యన్‌ను విడుదల చేయడానికి బదులుగా కొంతమంది ఎన్‌సిబి అధికారులు డబ్బు దోపిడీకి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఎన్‌సీబీ విచారణ జరుపుతోంది.

    English summary
    Aryan Khan Kidnap Plan Ruined By Selfie Says Maharashtra Minister Nawab Malik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X