twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan Arrest: దారుణంగా లోదుస్తుల్లో డ్రగ్స్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి.. కోర్టుకు షారుక్ కుమారుడు

    |

    బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌తో పట్టుపడిన సంఘటన భారతీయ సినిమా పరిశ్రమను కుదిపేసింది. ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్ సేవిస్తున్నారని, రేవ్ పార్టీ జరుగుతున్నదనే పక్కా సమాచారంతో ముంబైకి చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆర్యన్ ఖాన్ పట్టుపడటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

    సమీర్ వాంఖడే నేతృత్వంలో

    సమీర్ వాంఖడే నేతృత్వంలో


    సమీర్ వాంఖండే నేతృత్వంలో ముంబై ఎన్సీబీ జరిపిన దాడిలో ఆర్యన్ ఖాన్ స్నేహితుడు, నటుడు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇష్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్, గోమిత్ చోప్రాం, విక్రాంత్ చోకర్ ఉన్నారు. మున్ మున్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనే విషయం బయటకు వచ్చింది. ముంబైలోని ప్రముఖుల వారసులపై ఎన్సీబీ పక్కాగా వలపన్నీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

    భారీగా డ్రగ్స్ స్వాధీనం

    భారీగా డ్రగ్స్ స్వాధీనం

    ఎన్సీబీ అధికారులు నిర్వహించిన దాడిలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. వారు ధరించిన బట్టల్లో, లోదుస్తుల్లో, మనీ పర్సులు, అలాగే షూస్ నుంచి వారు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దాడిలో నిందితుల నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల మెఫెడ్రోన్, 1.3 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకొన్నాం అని ఎన్సీబీ అధికారులు చెప్పారు.

    జుడిషియల్ కస్టడీకి ఆర్యన్ ఖాన్

    జుడిషియల్ కస్టడీకి ఆర్యన్ ఖాన్


    ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌ను ధ‌ృవీకరించిన అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్లి 4 గంటల ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. వారిని హాస్పిటల్ నుంచి 40 నిమిషాల తర్వాత వెనుకకు 7 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి హాలీడే కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం కోర్టులకు సెలవులు కావడంతో హాలీడే కోర్టు వారికి జుడిషియల్ కస్టడీకి అప్పగించింది.

    కోర్టు విచారణకు హాజరైన గౌరీ ఖాన్

    కోర్టు విచారణకు హాజరైన గౌరీ ఖాన్

    ఆర్యన్ ఖాన్‌ను ముంబై కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ కోర్టు విచారణకు షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్‌ హాజరయ్యారు. అయితే ఈ విచారణ అనంతరం ఆర్యన్ ఖాన్‌ను మరికొన్ని రోజులు కస్టడీని ఎన్సీబీ కోరే అవకాశం ఉంది. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్ సెక్షన్ల 27 కింద కేసు నమోదు చేశారు. నిషేధిత డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై పిటిషన్‌లో దాఖలు చేశారు.

    ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వండి

    ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వండి

    ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌తో పట్టుబడలేదు. కాబట్టి బెయిల్‌పై విడుదల చేయాలని ప్రముఖ లాయర్ సతీష్ మాన్‌షిండే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. క్రూయిజ్‌లో ఆయనకు ప్రవేశం లేదు. బోర్డింగ్ పాస్ కూడా లేదు. ఆయన వద్ద డ్రగ్స్ లభించలేదు అని సతీస్ మాన్‌షిండే తన వాదనలు వినిపించారు. అయితే ఆర్యన్ విచారిస్తే డ్రగ్స్ సప్లయర్లు, ఇతర ప్రముఖుల విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కస్టడీని పొడిగించాలని ఎన్సీబీ అధికారులు కోరుతున్నారు.

    Recommended Video

    Supyaardee Singh & Aryan Krishna Interview Part 3 | Cheppina Evaru Nammaru
    We Stand With SRK ట్రెండింగ్

    We Stand With SRK ట్రెండింగ్

    ఇదిలా ఉండగా షారుక్ ఖాన్ అభిమానులు ఆయనకు అండగా నిలుస్తూ.. సోషల్ మీడియాలో సంఘీభావాన్ని ప్రకటించారు. . #WeStandWithSRK అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము షారుక్ ఖాన్ కుటుంబానికి బేషరతుగా అండగా నిలుస్తాం. ఆయనకు మనోధైర్యాన్ని కల్పించే బాధ్యత మాపై ఉంది అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    Shah Rukh Khan's son Aryan Khan arrested by Narcotics Control Bureau on Sunday afternoon: In this occassion, Actor Salman Khan visited Shah Rukh Khan's Mumbai home around midnight on Sunday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X