Aryan Khan డ్రైవర్ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. షారుక్‌కు మరో షాక్.. రంగంలోకి సల్మాన్ ఖాన్ లాయర్!
ముంబై నుంచి గోవాకు వెళ్తున్న ఓడలో జరిగిన పార్టీలో నిషేధిత డ్రగ్స్ ఉపయోగించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఎన్సీబీ అధికారులు పలు కోణాల్లో విచారణ దూకుడు పెంచారు. ఈ వివరాల్లోకి వెళితే..

మూబోసారి బెయిల్ పిటిషన్ దాఖలు
ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ సోమవారం ముంబై కోర్టులో జరిగింది. అయితే ఈ రోజు బెయిల్ దొరకకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. అయితే బుధవారం మరోసారి కోర్టు బెయిల్ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే ఎన్సీబీ తన రిపోర్టును కోర్టుకు వెల్లడించే అవకాశం ఉంది.

ప్రతీ రోజు అరెస్టుల పర్వం
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ రాకెట్‌లో ఉన్న నిందితులపై మెరుపు దాడులు నిర్వహిస్తూ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నది. ప్రతీ రోజు ఎవరో ఒక్కరిని అరెస్ట్ చేస్తూ సంచలనం దిశగా దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో షారుక్ ఖాన్ డ్రైవర్‌ను కూడా విచారించింది. అనంతరం ముంబైలో పలు చోట్ల ఆరు గంటలపాటు మెరుపుదాడులు నిర్వహించడం గమనార్హం.

నిర్మాత ఇంటి, ఆఫీసులపై దాడి
ఎన్సీబీ అధికారులు శనివారం నిర్మాత ఇంతియాజ్ ఖత్రీ నివాసాలు, కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అనంతరం విచారణకు హాజరుకావాలంటే సదరు నిర్మాతకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇంతియాజ్ ఖత్రీని సోమవారం విచారణకు పిలిచారు. ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్ డ్రైవర్‌ను కూడా విచారించేందుకు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ నిర్మాత విచారణ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో కూడా ఇంతియాజ్ ఖాన్‌ను విచారిస్తున్నారు. ఈ కేసులో అచిత్ కుమార్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇంతియాజ్‌పై దర్యాప్తు చేపట్టారు. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్‌ను అధికారులు విచారించగా అచిత్ కుమార్ పేరు బయటకు వచ్చింది. అచిత్ కుమార్‌ను విచారిస్తూ ఎన్సీబీ ఈ కేసు గుట్టురట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
Recommended Video

రంగంలోకి సల్మాన్ ఖాన్ లాయర్
ఇదిలా ఉండగా, అచిత్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా వేయడంతో షారుక్ ఖాన్‌కు షాక్ తగిలింది. అయితే ఎలాగైనా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇప్పించడానికి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ ఇప్పించిన లాయర్ అమిత్ దేశాయ్‌ను రంగంలోకి దించారు. అమిత్ దేశాయ్ తన సత్తాను చాటి ఆర్యన్‌కు బెయిల్ ఇప్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











