twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan khan : పేదల సంక్షేమానికి కృషి చేస్తా.. కౌన్సెలింగ్ లో ఆర్యన్ ఖాన్ నీతి సూత్రాలు

    |

    బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం ఆర్థర్ జైల్లో ఉన్నాడు. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయం సెషన్స్ కోర్టులో ఉంది. అతనికి బెయిల్ వస్తుందా లేదా అనే విషయం మీద అక్టోబర్ 20న క్లారిటీ రానుంది. ఇక మరో పక్క సోషల్ మీడియాలో ఒక వర్గం ఆర్యన్ ఖాన్‌ని ట్రోల్ చేస్తోంటే మరో వర్గం ఆర్యన్‌కు తన సంతాపాన్ని తెలియజేస్తూ షారుఖ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ఎంసీబీ కౌన్సిలింగ్ లో ఆర్యన్ ఖాన్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

    పేదలకు సహాయం చేస్తా

    పేదలకు సహాయం చేస్తా

    బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నాడు. కోర్టు ఇప్పుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తు రిజర్వ్ చేసింది, ఈ కారణంగా అతను 20 వ తేదీ వరకు జైలులో ఉండాల్సి ఉంటుంది. ఇంతలో, ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పేదలకు సహాయం చేస్తానని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

    ఆర్యన్ ఖాన్ కౌన్సిలింగ్

    ఆర్యన్ ఖాన్ కౌన్సిలింగ్

    పిటిఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం, ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ సమయంలో, ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, పేదలు మరియు బలహీ వర్గాల ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడట. ఇది కాకుండా, ఆర్యన్ సమీర్ వాంఖడేకు కూడా ఏదో ఒక రోజు తాను గర్వపడేలా చేస్తానని కూడా చెప్పాడట.

    అక్టోబర్ 20 న

    అక్టోబర్ 20 న

    క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ విచారణ గురువారం ముంబై సెషన్స్ కోర్టులో జరిగిందనే సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేయబడింది. ఈ కేసుపై అక్టోబర్ 20 న విచారణ జరగనుంది. ఈ సమయంలో, ఆర్యన్ ఖాన్ తరపున సతీష్ మన్ షిండే మరియు అమిత్ దేశాయ్, NCB తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించనున్నారు.

     ఖైదీ నంబర్ కూడా

    ఖైదీ నంబర్ కూడా

    మీడియా నివేదికల ప్రకారం, ఆర్యన్ ఖాన్ విచారణ సంఖ్య N956. ఎందుకంటే జైలులో ఎవరినీ పేరు ద్వారా కాదు, అతని నెంబర్ ద్వారానే పిలుస్తారు. ఇక ఈ పరిస్థితిలో, ఆర్యన్ ఖాన్ కి ఖైదీ నంబర్ కూడా ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ జైల్లో చాలా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. జైల్లో సరిగా తినడం లేదని అంటున్నారు. జైలు అధికారులు పెట్టె భోజనం ఆర్యన్ కి నచ్చలేదని అంటున్నారు.

    Recommended Video

    Supyaardee Singh & Aryan Krishna Interview Part 3 | Cheppina Evaru Nammaru
    భోజనం లేక

    భోజనం లేక

    అయితే బయట నుండి ఆహారం తీసుకురావడం లేదా బయట ఆహారం తీసుకోవడం కూడా జైలులో అనుమతించబడదు. అయితే జైల్లో ఆర్యన్ ఖాన్ సాధారణ బట్టలే ధరించాడు. అక్టోబర్ 2 న ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అరెస్టు చేసింది. కేసు పురోగతి తర్వాత, ఆర్యన్ కోర్టు ద్వారా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఆర్థర్ జైలుకు పంపబడ్డాడు.


    English summary
    Aryan Khan says he Will work for society during NCB counselling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X