Aryan Khan హైకోర్టులో గందరగోళం.. బెయిల్ విచారణ నిలిపివేత.. డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు సినీ తారలు పిల్లలు

స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ఉత్కంఠగా మారింది. ముంబై ఎన్టీపీఎస్ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో షారుక్ ఖాన్ కుటుంబం బాంబే హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు అర్ధాంతరంగా దానిని నిలిపి వేసింది. దాంతో ఆర్యన్ ఖాన్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్తితి ఏర్పడినట్టు కనిపిస్తున్నది. అయితే ఈ కేసు విచారణలో మరో ఇద్దరు స్టార్ హీరోల పిల్లల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బాంబే హైకోర్టులో బెయిల్‌పై విచారణ

బాంబే హైకోర్టులో బెయిల్‌పై విచారణ

అక్టోబర్ 3న డ్రగ్స్ పార్టీపై ఎన్సీబీ దాడి చేసిన క్రమంలో పట్టుబడిన ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే నాలుగుసార్లు బెయిల్ లభించకపోవడంతో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని రంగంలోకి దించారు. అయితే మంగళవారం (అక్టోబర్ 26) ఉదయం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణను ప్రారంభించింది.

 కోర్టులో గందరగోళం.. విచారణ నిలుపుదల

కోర్టులో గందరగోళం.. విచారణ నిలుపుదల

అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ అత్యంత ప్రాధాన్యం, అందరి దృఫ్టిని ఆకర్షించడంతో బాంబే హైకోర్టుకు మీడియా, న్యాయవాదులు, సాధారణ పౌరులు పోటెత్తారు. విచారణ సందర్భంగా కోర్టు హాల్‌లో గందరగోళం నెలకొనడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈ హంగామా తగ్గడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు విచారణ ఆపివేశారనే వార్తలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి

అనన్యతో డ్రగ్స్ కొనుగోలు గురించి

అనన్యతో డ్రగ్స్ కొనుగోలు గురించి

ఆర్యన్ ఖాన్ తన అరెస్ట్‌కు ముందు డ్రగ్స్ కావాలని బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో వాట్సప్‌ చాట్ చేశారు. అయితే తాను నీకు అరెంజ్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను అంటూ అనన్య సమాధానం ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఫోన్ సీజ్ చేసిన అధికారులు వాట్సప్ ఛాట్స్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలోనే అనన్యకు సమన్లు పంపి విచారిస్తున్నారు.

తెరపైకి మరో ముగ్గురు సినీ ప్రముఖుల పిల్లలు

తెరపైకి మరో ముగ్గురు సినీ ప్రముఖుల పిల్లలు

ఇక ఆర్యన్ ఖాన్ వాట్సప్ ఛాటింగ్‌లో ఆయన భారీ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అచిత్కుమార్ నుంచి రూ.80 వేల రూపాయల డ్రగ్స్ (వీడ్)ను కొనుగోలు చేసినట్టు సాక్ష్యాలు సంపాదించారు. అంతేకాకుండా అనన్యపాండేతో కాకుండా మరో ముగ్గురు స్టార్ హీరోల పిల్లలతో కూడా డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది.

 సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులకు సిద్దం

సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులకు సిద్దం

బాంబే హైకోర్టులో తాజాగా బెయిల్ విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్ తోసి పుచ్చాలని, ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో చాలా మంది సినీ ప్రముఖుల హస్తం ఉంది. ఇంకా సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇస్తే.. దర్యాప్తుకు ఆటకం ఏర్పడుతుంది అని ఎన్సీబీ వాదనలు వినిపించినట్టు సమాచారం.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
 నో బెయిల్.. విచారణ వాయిదా

నో బెయిల్.. విచారణ వాయిదా

ఎలాగైనా తన కుమారుడికి బెయిల్ లభించేలా ప్రయత్నాలు చేస్తున్న షారుక్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. మంగళవారం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన విచారణను బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చేపట్టనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X