‘అతిగా ముద్దులు.. అర్ధనగ్నంగా సీన్లు.. ఐశ్వర్యరాయ్ అందుకే సక్సెస్ కాలేదు’

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక జీవితంలోని విశేషాలు, ఎత్తు పల్లాలు అనేక విషయాలు వెల్లడించే ఆత్మకథ తాజాగా రిలీజైంది. ప్రియాంక చోప్రా - ఇంక్రెడిబుల్ స్టోరి ఆఫ్ ఏ గ్లోబల్ సూపర్‌స్టార్ అనే పేరుతో ఆత్మకథ విడుదలైంది. ఈ బయోగ్రఫిని అసీమ్ ఛబ్రా రాశారు. ఐశ్వరరాయ్ కంటే ప్రియాంక ఎక్కువగా సక్సెస్ కావడం వెనుక కారణాలను రచయిత వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..

 వివాదాస్పద అంశాలకు దూరంగా

వివాదాస్పద అంశాలకు దూరంగా

ప్రియాంక చోప్రా బయోగ్రఫి వివాదాస్పద అంశాలు ప్రస్తావించకపోవడం గమనార్హం. షారుక్ ఖాన్, షాహీద్ కపూర్‌, అక్షయ్‌ కుమార్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారి మధ్య వచ్చిన వార్తలు, రూమర్లకు దూరంగా ఈ బయోగ్రఫి ఉంది. చాలా వివాదాస్పద అంశాలను టచ్ చేయలేదు. వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించకపోవడంపై రచయిత ఛాబ్రా క్లారిటీ ఇచ్చారు.

కరణ్‌ జోహర్, ప్రియాంక వివాదం

కరణ్‌ జోహర్, ప్రియాంక వివాదం

కరణ్ జోహర్, ప్రియాంక చోప్రా మధ్య వివాదం మీడియాలో అప్పట్లో ప్రముఖంగా మారింది. అదే విషయాన్ని గురించి కరణ్‌‌తో మాట్లాడాను. కానీ ఆ వివాదానికి వెనుక అసలైన కారణాన్ని తను చెప్పడానికి ఆసక్తి చూపలేదు. ప్రియాంకతో వివాదం గతానికి సంబంధించిన వార్త అని ఛాబ్రా పేర్కొన్నాడు.

ప్రియాంక చోప్రా పాపులర్ కావడానికి

ప్రియాంక చోప్రా పాపులర్ కావడానికి

హాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ కంటే ప్రియాంక చోప్రా రాణించడానికి, పాపులర్ కావడానికి కారణం న్యూడ్ (అశ్లీల నిబంధన) క్లాజ్ మాత్రమే అని ఛాబ్రా వెల్లడించారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నప్పుడు దానిని వదులుకొని హాలీవుడ్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం అతి పెద్ద విజయం. ఆ విషయంలో ఐశ్వర్యరాయ్ విఫలమయ్యారు అని ఛాబ్రా అభిప్రాయపడ్డారు.

ఐశ్వర్య కొన్నింటిని వదులుకోలేదు

ఐశ్వర్య కొన్నింటిని వదులుకోలేదు

ఐశ్వర్యరాయ్ అందాల సుందరి అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ హాలీవుడ్‌లో రాణించాలంటే కొన్నింటిని వదులుకోవాలి. అందుకు ఐశ్వర్యరాయ్ సిద్దపడలేదు. ముద్దులు పెట్టుకోవాలి. న్యూడ్ (అర్ధనగ్న) సీన్లలో నటించాలి. ఇలాంటి వాటిని ఒప్పుకోవడానికి విధించే క్లాజును ఐశ్వర్యరాయ్ అంగీకరించలేదు అని ఛాబ్రా పేర్కొన్నాడు.

సెక్స్ సీన్లకు ప్రియాంక రెడీ

సెక్స్ సీన్లకు ప్రియాంక రెడీ

ఏదైతే ఐశ్వర్య అంగీకరించలేదో, ప్రియాంక వాటిని ఒప్పేసుకొన్నది. అలా అని అతిగా ముద్దు సీన్లలో నటించలేదు. అలాగే సెక్స్ సీన్లలో నటించలేదు. కానీ అలాంటి వాటిని చేయడానికి నిరాకరించలేదు. వెనుకాడలేదు. అందుకే ప్రియాంక సక్సెస్ అయింది.

ప్రియాంక చోప్రా తెలివైన నటి

ప్రియాంక చోప్రా తెలివైన నటి

ప్రియాంక చాలా తెలివైన నటి. ఎప్పుడు ఎలా వ్యవహారించాలో ఆమెకు బాగా తెలుసు. సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ఎదుటివాళ్లను బుట్టలో వేసుకోవడం ఎలానో అనే విషయం ఆమెకు తెలిసినంత మరొకరికి తెలియదు. అందుకే హాలీవుడ్‌లో కూడా రాణించింది అని ఛాబ్రా తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X