twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Asha Parekh దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. అద్భుతమైన నటికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం

    |

    ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు ఆశాపరేఖ్‌కు అరుదైన గౌరవం లభించింది. భారతీయ సినిమా పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గుర్తుగా ఆశాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కేంద్ర సమాచారం ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా ఆశాపరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ అవార్డు వివరాల్లోకి వెళితే..

    అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేస్తూ

    కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేస్తూ.. ఇండియన్ సినిమాకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను.. ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరిస్తున్నాం. జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును రాష్ట్రపతి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తారు అని వెల్లడించారు.

    దాదా సాహెబ్ ఫాల్కే కమిటీ

    దాదా సాహెబ్ ఫాల్కే కమిటీ

    దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని ఆశా భోంస్లే, హేమా మాలిని, పూనమ్ థిల్లాన్, ఉదిత్ నారాయణ్, టీఎస్ నాగభరణ సమావేశమై ఆశా పరేఖ్ పేరును ఏకగ్రీవంగా సూచించారు. విజ్జాన్ భవన్‌లో నేషనల్ ఫిలిం అవార్డులను ప్రదానం చేసే రోజున ఈ అవార్డును ఆశా పరేఖ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందజేస్తారు అని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

    50 కుపైగా చిత్రాల్లో

    50 కుపైగా చిత్రాల్లో

    ప్రముఖ నటి ఆశా పరేఖ్ 10 ఏళ్ల వయసులోనే నట జీవితాన్ని ప్రారంభించారు. ఆశా పరేఖ్‌ను ప్రముఖ దర్శకుడు బీమల్ రాయ్‌ సినీ రంగానికి పరిచయం చేశారు. 50కి పైగా చిత్రాల్లో నటించారు. 1998 నుంచి 2001 వరకు సీబీఎఫ్‌సీ చైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. భారతీయ సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

    సెప్టెంబర్ 30వ తేదీన

    సెప్టెంబర్ 30వ తేదీన

    భారతీయ సినిమా పరిశ్రమలో విశేష సేవలు అందించిన సినీ ప్రముఖులకు నేషనల్ ఫిలిం అవార్డుల ప్రదానం సెప్టెంబర్ 30వ తేదీన జరుగనున్నది. ఈ వేడుకలో జాతీయ పురస్కారాలతోపాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్‌కు రాష్ట్రపతి అందజేస్తారు.

    1992లో పద్మశ్రీ

    1992లో పద్మశ్రీ

    గతంలో ఆశా పరేఖ్‌ను కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డును అందజేశారు. నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులతోపాటు.. ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఆశా పరేఖ్ అందుకొన్నారు.

    English summary
    Union Information and Broadcasting Minister Anurag Singh Thakur took to his Twitter to Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to recognise & award Smt Asha Parekh ji for her exemplary lifetime contribution to Indian Cinema. The Dadasaheb Phalke Award shall be presented by the Hon President of India at 68th NFA in Vigyan Bhawan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X