twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుల్వామా ఎఫెక్ట్: సెట్‌కి వచ్చి మరీ తగలబెట్టేస్తాం.. గుర్తుంచుకోండి, బాలీవుడ్‌కు ఘాటైన వార్నింగ్!

    |

    ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. పాక్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో జరిగిపిన ఆత్మాహుతి దాడిలో 49మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు ఇంకా దేశం నలుమూలల కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క భారత పౌరుడు ఉగ్రవాదుల దాడిని, పాక్ వక్రబుద్ధిని తీవ్రంగా తప్పు బడుతున్నారు. పాక్ కు బుద్ది వచ్చే చర్యలని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రభావం భారత చిత్ర పరిశ్రమపై కూడా పడింది.

     కీలక ప్రకటన

    కీలక ప్రకటన

    ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశంలో పాక్ కు వ్యతిరేకంగా తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్న తరుణంలో అశోక్ పండిట్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఇక బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఎవరూ తమ చిత్రాల్లో పాకిస్థాన్ నటుల్ని, టెక్నీషియన్స్ ని తీసుకోవడానికి వీల్లేదని ప్రకటించారు.

    తగలబెట్టేస్తాం

    తగలబెట్టేస్తాం

    భారత చిత్రాల్లో పాక్ నటీనటులు, టెక్నీషియన్ల ప్రమేయం ఉండకూడదు. ఈ నిబంధన చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన విభాగాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అశోక్ పండిట్ అన్నారు. కాదని ఎవరైనా పాక్ నటీనటులతో సినిమాలు చేస్తే లొకేషన్ కు వచ్చి మరీ సెట్ ని తగలబెట్టేస్తాం అని తీవమైన హెచ్చరిక జారీ చేశారు.

     సింగర్స్ కూడా

    సింగర్స్ కూడా

    ప్రముఖ మ్యూజిక్ కంపెనీలైన టి సిరీస్ లాంటి సంస్థలు ఎక్కువగా పాకిస్థానీ సింగర్స్ తో ఆల్బమ్స్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా అశోక్ పండిట్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాలోని అన్ని మ్యూజిక్ కంపెనీలు పాకిస్తానీ సింగర్స్ తో కలసి పనిచేయడం ఆపేయాలని హెచ్చరించారు. టి సిరీస్ సంస్థ ఇప్పటికే పాకిస్తానీ సింగర్స్ తో ప్రారంభించిన కొన్ని ఆల్బమ్స్ ని ఆపేసినట్లు తెలుస్తోంది.

    రంగంలోకి దిగుతున్న ఆ పార్టీ

    రంగంలోకి దిగుతున్న ఆ పార్టీ

    మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అప్పుడే రంగంలోకి దిగేసింది. పాకిస్తానీ నటులు బాలీవుడ్ లోకి రాకుండా నవనిర్మాణ సేన అనుబంధ సంస్థ అయిన చిత్రపత్ సేన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2016లో యురి సంఘటన జరిగిన తర్వాత కూడా బాలీవుడ్ నటులని నిషేధించాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఈ వాదనని అప్పట్లో సల్మాన్ ఖాన్ తప్పుబట్టాడు. దేశాల మధ్య నెలకొన్న వివాదం విషయంలో నటులు ఏం చేశారంటూ సల్మాన్ వ్యాఖ్యానించడంతో తీవ్రమైన విమర్శలు చెలరేగాయి.

    English summary
    Ashok Pandit announcement on ban Pakistani actors
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X