హీరోయిన్ అసిన్ ఏం చేస్తోందో తెలుసా? ఈ ఫోటోలతో సర్‌ప్రైజ్
హీరోయిన్ అసిన్ ప్రముఖ వ్యాపార వేత్త రాహుల్ శర్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాహుల్ తో పరిచయం తర్వాత అసిన్ సినిమా రంగాన్ని క్రమక్రమంగా వదిలేసింది. గతేడాది కాలంగా అసిన్ పేరుకానీ, ఫోటోలు కానీ బాలీవుడ్ సర్కిల్‌లో కనిపించడం లేదు, వినిపించడం లేదు.
బయట కనిపించకుండా, సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా లేకుండా అసిన్ ఏం చేస్తోంది? అంటే..... ఆమె పూర్తి తన కూతురు అరిన్ బాధ్యతలు చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు. అరిన్ జన్మించిన ఈ అక్టోబర్ 24, 2018తో సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అసిన్-రాహుల్ శర్మ దంపతులు తమ కుమార్తె ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

ఫోటోలతో అసిన్ సర్‌ప్రైజ్
చాలా కాలం తర్వాత అసిన్ సోషల్ మీడియా పేజీల్లో కొత్తగా పోస్టులు పెట్టినట్లు నోటిఫికేషన్ రావడంతో అవేమిటని ఓపెన్ చూసిన ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. తన కూతురు అరిన్ ఫస్ట్ బర్త్ డే ఫోటోలను, వీడియోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

అసిన్‌ను చూసినట్లే
అరిన్ లుక్ అచ్చం అసిన్ మాదిరిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అరిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందంగా అలంకరించిన ఓ గార్డెన్‌లో ఈ పుట్టినరోజు వేడుక నిర్వహించారు.

మళ్లీ సినిమాల్లోకి వస్తుందా?
హీరోయిన్లు పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత మళ్లీ సినిమా వైపు అడుగులు వేయడం మామూలే. అయితే అసిన్‌కు ఆ ఉద్దేశ్యం ఉందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. బహుషా ఆమె మళ్లీ వెండితెర వైపు రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అక్షయ్ కుమార్ వల్లే
హీరో అక్షయ్ కుమార్ వల్లనే అసిన్-రాహుల్ శర్మ వివాహం జరిగింది. అక్షయ్, రాహుల్ స్నేహితులు. అక్షయ్ మూవీలో హీరోయిన్‌గా చేసిన అసిన్‌కు... ఓ ఫంక్షన్లో రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి ఆపై పెళ్లికి దారి తీసింది. వీరి ప్రేమకు అక్షయ్ కుడా హెల్ప్ చేశాడు.


Click it and Unblock the Notifications











