అవకాశాలు రావడం లేదని నటి ఆత్మహత్య.. ఇండస్ట్రీలో విషాదం
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు జరుపుతూనే ఉంటారు. ఈ ప్రాసెస్‌లో కొత్త వారు వస్తుంటారు.. పాత వాళ్లు కనుమరుగైపోతుంటారు. అయితే, టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరోవైపు, అవకాశాలు రాక కొంత మంది, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోక కొంత మంది పరిశ్రమకు దూరమై పోతుంటారు. వీరిలో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
సినిమా అవకాశాలు రావడం లేదని ఓ వర్ధమాన నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నటి (20) సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుండేది. సరైన అవకాశాల కోసం ఎంతగానే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఒషివార ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. అయితే, ఆమెకు సినిమాల్లో ఛాన్స్‌లు మాత్రం రాలేదు.

సినిమా అవకాశాలు రాకపోవడంతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో సదరు నటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే గత రాత్రి ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ టెర్రస్ పై నుంచి దూకేసింది. దీంతో సంఘటనా స్థలంలోనే మరణించింది. దీనికి సంబంధించిన విషయాలను అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ కూడా వెల్లడించాడు.
అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ బిపిన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 'గత రాత్రి 12 గంటల సమయంలో ఎవరో గొడవ పడుతున్నట్లు అనిపించింది. వెంటనే రోడ్డు మీదకు వచ్చి చూశాను. అయితే, అది అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్థు నుంచి వినిపిస్తున్నట్లు కనుగొన్నాను. వెంటనే అక్కడకు వెళ్లాను. అప్పటికే ఆమె పై నుంచి కిందికి దూకేసింది' అని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications