twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అస్సాం వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన సినీ స్టార్లు!

    |

    భారీ వర్షాలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. బీహార్ రాష్ట్రంపై కూడా ఈ వరద ప్రభావం భారీగా ఉంది. రెండు రాష్ట్రాల్లో కలిపి కోటి మందికిపైగా ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 160 మందికిపైగా మరణించినట్లు అంచనా. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

    కాగా... వరద బాధితులను ఆదుకునేందుకు పులువురు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్సాం వరద బాధితులకు రూ. 51లక్షలను విరాళంగా అందించి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితులకు తమకు తోచిన సహాయం చేయాలని, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు అండగా నిలవాలని అమితాబ్ అభిమానులను కోరారు.

    అమితాబ్ కంటే ముందు అక్షయ్ కుమార్ అస్సాం వరద బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కష్ట సమయంలో మన వాళ్ల కోసం సహాయం చేయాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

    Assam flood CM Relief Fund: Akshay Kumar donation Rs 1 cr, Amitabh Bachchan Rs 51 lakhs

    గతంలోనూ పలు సందర్భాల్లో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. బాలీవుడ్లో భారీగా సంపాదన కలిగిన స్టార్లైన వీరు రైతుల కోసం, జవాన్ల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

    సినిమాల విషయానికొస్తే... అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. దీంతో పాటు హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్ చిత్రాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఝండ్, సైరా నరసింహారెడ్డి, బ్రహ్మాస్త్ర, చెహ్రె, గులాబో సితాబో చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    The disastrous floods in Assam affected many lives and properties. Bollywood celebrities have been coming out and asking people to donate their bit. Amitabh Bachchan wrote, "Assam is in distress .. the floods have caused great damage .. send care and assistance for our brothers and sisters .. contribute generously to the CM Relief Fund .. I just did .. HAVE YOU ..?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X