Ranbir Kapoor: ఆలియా భట్ మరోసారి తల్లి అయ్యే అవకాశం.. వాళ్ళు ఏం చెబుతున్నారంటే?

పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రోజుల్లో వెంటనే పిల్లలను కనాలని అంటే సెలబ్రెటీలు కంగారు పడిపోతుంటారు. చాలా వరకు సినీ జంటలు మూడు పదుల వాయిసు దాటిన తర్వాత గాని పిల్లల విషయం గురించి ఆలోచించడం లేదు. కానీ రణ్‌బీర్‌ కపూర్ అలియా భట్ మాత్రం వారి ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చాలా ఉత్సాహంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి పెళ్లి జరిగి మూడు నెలలు కాకముందే మంచి శుభవార్తతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. అయితే అలియా మరోసారి తల్లి కాబోతుంది అని ఇక వారికి మొత్తంగా ఎంతమంది పిల్లలు ఉంటారు అనే విషయంలో బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఆ సంగతి ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

సింపుల్ గానే వివాహ వేడుక

సింపుల్ గానే వివాహ వేడుక

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా మంచి గుర్తింపును అందుకున్న రణ్‌బీర్‌ కపూర్ ఆలియా భట్ ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాదిలోనే వీరు పెళ్లి చేసుకుంటారు అని అనేక రకాల రూమర్స్ అయితే వినిపించాయి. కానీ ఈ జంట ఎప్పుడు కూడా పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వకుండా సినీ జీవితాన్ని కొనసాగించారు. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు.

 పెళ్లి అయిన తరువాత రోజే..

పెళ్లి అయిన తరువాత రోజే..

సాధారణంగా సినీ తారలు పెళ్లి చేసుకోగానే వారి ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా గడిపేందుకు ఒక రెండు మూడు నెలలకు సినిమాలకు దూరంగా ఉంటూ ఏదైనా వెకేషన్ కు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా హనీమూన్ అనేది వారి జీవితంలో చాలా ప్రత్యేకం అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రణ్‌బీర్‌ కపూర్ ఆలియాభట్ మాత్రం అలాంటివి ఏమీ లేకుండా పెళ్లి జరిగిన తదుపరి రోజే వారి సినిమాల పనుల్లో బిజీ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అప్పుడే గుడ్ న్యూస్

అప్పుడే గుడ్ న్యూస్

అలాగని పూర్తిగా సినిమాలతో బిజీగా ఉండకుండా అప్పుడప్పుడు రణ్‌బీర్‌ ఆలియా ఇద్దరు కూడా ప్రత్యేకంగా టైం స్పెండ్ చేస్తూ వస్తున్నారు. ఇక మొత్తానికి మూడు నెలలు తిరగకముందే మా ఇంట్లోకి పాపాయి రాబోతోంది అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వడం వైరల్ అయ్యింది. గత రెండు మూడు రోజులుగా వీరికి సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 వారి లైఫ్ గురించి జ్యోతిష్యం

వారి లైఫ్ గురించి జ్యోతిష్యం

అయితే ఆలియా భట్ రణ్‌బీర్‌ కపూర్ కు సంబంధించిన భవిష్యవాణి గురించి కూడా ఆస్ట్రాలజీల సమక్షంలో బాలీవుడ్ మీడియా చానల్స్ డిబేట్ నిర్వహిస్తుండడం విశేషం. రీసెంట్ గా ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానెల్ లో ప్రముఖ జ్యోతిష్యుడు భావిక్ సంఘ్వి ఆలియా రంబీర్ కు సంబంధించిన ఫ్యూచర్ గురించి తనదైన శైలిలో వివరణ ఇవ్వడం విశేషం.

 మొత్తం ఇద్దరు పిల్లలు అంటూ..

మొత్తం ఇద్దరు పిల్లలు అంటూ..

ఆలియా పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అని అయితే వీరికి మరొక సంతానం కూడా ఉంటుంది అని జ్యోతిష్యుడు భావిక్ సంఘ్వి తెలియజేశారు. వీరికి ఇద్దరు సంతానం అంటూ వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని ఆలియా, రన్ బీర్ తరహాలోనే వారి పిల్లలపై కూడా జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుందని మంచి రాజయోగం ఉందని కూడా తెలియజేశారు. ఇక రణ్‌బీర్‌ బ్రహ్మాస్త్ర సినిమా ఫెయిల్ అవుతుందని ఆలియా మాత్రం తదుపరి సినిమా 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' మాత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X