Shefali Jariwala Death: షెఫాలీ జరివాలా మరణాన్ని ఆమెకు ముందే చెప్పిన జ్యోతిష్కుడు.. జాతకం వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్, కాంటా లాగా పాటతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సాధించిన షెఫాలీ జరివాలా ఆకస్మిక మరణం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరనే విషయంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆమె మరణానికి కారణం యాంటీ ఏజింగ్ కోసం తీసుకొన్న ఇంజెక్షన్లే కారణమనే విషయం ప్రధానంగా మీడియాలో వినిపిస్తున్నది. అయితే ఆమె మరణం తర్వాత తన జాతకం గురించి షెఫాలీకి ఓ జ్యోతిష్కుడు చెప్పిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో షెఫాలీకి ఏం చెప్పారంటే?
బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి కుప్పకూలడంతో భర్త, టీవీ నటుడు పరాగ్ త్యాగి ఆమెను వెంటనే ముంబై నగరంలోని అంధేరీ ఉన్న బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఆమె కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణం సంభవించిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పార్తీవ దేహాన్ని పోస్టు మార్టమ్ కోసం జుహులోని కూపర్ హాస్పిటల్‌కు తరలించారు.

అయితే కూపర్ హాస్పిటల్ వైద్యులు తమ పోస్టు మార్టమ్ రిపోర్టులో ఆమె బీపీ సడెన్‌గా పడిపోవడంతో మరణం సంభవించి ఉంటుంది అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సత్యనారాయణ పూజ నేపథ్యంలో ఉపవాసం ఉన్నారని ఆమె భర్త వెల్లడించారు. ఆమె భర్త, కుటుంబ సభ్యుల వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఇంటిలో పంచనామా చేసే సమయంలో రెండు బాక్సుల నిండా యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్లు, చర్మాన్ని ప్రకాశవంతగా చేసే మందులు, అలాగే విటమిన్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
అయితే షెఫాలీ మరణం వెనుక ఎలాంటి అనుమానాలు లేవు. దాంతో తాము ఆమె మృతిని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశాం. పోస్టు మార్టమ్ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. నివేదిక ఆధారంగా వెల్లడయ్యే విషయాలను తెలియజేస్తాం. అప్పటి వరకు తాము ప్రమాదకరమైన మరణంగానే భావిస్తామని అంధేరి పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో జరివాలా కుటుంబం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే షెఫాలీ మరణంపై అనేక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఉపవాసం తర్వాత ఆమె ఎలాంటి ఆహారం తీసుకొకుండా ఖాళీ కడుపుతోనే కాస్మోటిక్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ జరిగి ఉంటుంది అని వైద్యులు వెల్లడిస్తున్నారు. యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్స్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటాయి అని వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, షెఫాలీ జరివాలా ఇటీవల ఓ జ్యోతిష్కుడితో జరిపిన ఓ ప్రాడ్ కాస్ట్‌లో తన జాతకం గురించి అడిగింది. అయితే తన కుండలీ ప్రకారం నా జాతకంలో ఏమున్నది? అని అడిగితే.. అందుకు జవాబుగా నీ కుండలీ చూస్తే.. జాతకంలో 8వ పాదంలో చంద్రుడు, కేతువు, రాహువు ఉన్నారు. ఈ మూడు కూర్చోవడం వల్ల ఏదైనా తీవ్ర నష్టం వాటిల్ల వచ్చు. లేదా ఆకస్మిక మరణం సంభవించవచ్చు అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియోను మీరు కూడా చూడొచ్చు.


Click it and Unblock the Notifications











