సినీ ప్రేమ జంటకు షాకిచ్చిన జ్యోతిష్యుడు.. వాళ్లిద్దరి మధ్య అది జరిగితే ప్రమాదమట.!
సినీ ఇండస్ట్రీ అంటేనే లవ్ ట్రాక్‌లు, ఎఫైర్లు, డేటింగ్‌లు, బ్రేకప్పులు వంటివి సర్వ సాధారణం అన్న టాక్ ఉంది. దీనికి తగ్గట్లే ఇండస్ట్రీలో తరచూ ఇలాంటివే ఏదో ఒక పరిణామం వెలుగులోకి వస్తోంది. అన్ని పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది ట్రాకులు నడుపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంట ఒకటి. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జ్యోతిష్యుడు ఈ జంట గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే...

బాలీవుడ్ ప్లేబాయ్‌గా పేరొందిన రణ్‌బీర్
ప్రముఖ నటుడు రిషీ కపూర్ కుమారుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు రణ్‌బీర్ కపూర్. ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సినిమాల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో ప్లేబాయ్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించిన అతడు.. ప్రస్తుతం మరో భామతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు.

స్టార్ హీరోయిన్‌తో లవ్.. చివరి అంకానికి చేరింది
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్... స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని వాళ్లు ధృవీకరించక ముందే బాలీవుడ్ మీడియా లీక్ చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో చాలా రోజుల తర్వాత అటు రణ్‌బీర్.. ఇటు ఆలియా తమ ప్రేమ బంధం గురించి బహీర్గతం చేశారు. అంతేకాదు, ఈ జంట పెళ్లికి కూడా సిద్ధం అవుతోంది.

సీక్రెట్‌గా పెళ్లి.. అసలు విషయం తెలిసి షాక్
ప్రేమ వార్తతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్లిద్దరూ కలిసి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని ఓ వార్త హల్‌చల్ చేసింది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్ కోసం పెళ్లి చేసున్నట్లు దిగిన ఫొటో బయటకు రావడమే. మొదట అందరూ నిజమే అని భావించినా... అసలు విషయం తెలిసి షాకైపోయారు.

తండ్రి వల్లే నిశ్చితార్థం ఆలస్యం.. పెళ్లి ఖాయం
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వాస్తవానికి ఎప్పుడో నిశ్చితార్థం చేసుకోవాల్సి ఉంది. అయితే, అప్పట్లో రిషి కపూర్ అనారోగ్యం కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడేమో ఆయన మరణంతో పెళ్లి పనులు స్పీడందుకున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో ఎవరైనా మరణించిస్తే ఏడాదిలోపు శుభకార్యం చేయాలి. ఇప్పుడిదే కారణంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట.

సినీ ప్రేమ జంటకు షాకిచ్చిన జోతిష్యుడు
లాక్ డౌన్ పూర్తయిన వెంటనే రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ అగ్నిసాక్షిగా ఒక్కటి కాబోతున్నారని బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌తో సంబంధం ఉన్న ప్రముఖ జ్యోతిష్యులు అందరూ వీళ్లిద్దరి జాతకాల గురించి తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ జ్యోతిష్యుడు సినీ జంట గురించి ఓ విషయం చెప్పి షాకిచ్చాడు.
Recommended Video

వాళ్లిద్దరి మధ్య అది జరిగితే ప్రమాదమట.!
ముంబైకి చెందిన వినోద్ అనే జ్యోతిష్యుడు సోషల్ మీడియాలో.. ‘వాళ్లిద్దరి జాతకాలు బాగున్నాయి. వివాహం తర్వాత వీళ్ల కెరీర్ ఊపందుకుంటుంది. అయితే, ఆలియా జాతకంలో ఓ సమస్య ఉంది. దాని వల్ల ఈ జంటకు మనస్పర్ధలు వస్తాయి. అది చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం ప్రమాదం. దానికి వాళ్ల జ్యోతిష్యులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.


Click it and Unblock the Notifications











